రఘురాములు స్టాంప్ వెండర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని విష్ణు కాంప్లెక్స్ లో కిడ్స్ వేర్ దుకాణం కూడా ప్రారంభించాడు. ఈ దుకాణం బాధ్యతను భార్య శ్రీలక్ష్మి చూసుకునేది. అటు ఉద్యోగం, ఇటు దుకాణంతో రఘురాములు జల్సాలకు అలవాటుపడ్డాడు. అప్పులు చేయడం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. కిడ్స్ వేర్ బాధ్యత చూసుకుంటున్న శ్రీలక్ష్మికి ఇది చాలా విసుగును పుట్టించింది. భర్త ప్రవర్తన ఎప్పటికీ మారకపోవడంతో అతడిని అంతమొందించాలని భావించింది.