ఎర్రని రక్తంతో ఎర్రబెల్లి అద్భుత చిత్రం...మంత్రిపై యువనేత వీరాభిమానం

Published : Jul 04, 2023, 01:45 PM IST

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు రక్తంతో గీసిన ఫోటోను భర్త్ డే గిప్ట్ గా ఇచ్చి అభిమానాన్ని చాటుకున్నాడు బీఆర్ఎస్ యువ నాయకుడు. 

PREV
15
ఎర్రని రక్తంతో ఎర్రబెల్లి అద్భుత చిత్రం...మంత్రిపై యువనేత వీరాభిమానం
Errabelli Dayakar Rao

హైదరాబాద్ : హీరోలు, క్రికెటర్లకే కాదు కొందరు రాజకీయ నాయకులకూ ఎంతో ఇష్టపడే అభిమానులు వున్నారు. ప్రజాసేవతో పాటు తనవెంట నడిచే కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను ఇంటి మనుషుల్లా యోగక్షేమాలు చూసుకుంటూ కొందరు నాయకులు. ఇలా తమపై ప్రేమ ప్రదర్శించే నాయకుల కోసం ప్రాణాలిచ్చేందుకు, రక్తాన్ని దారపోసేందుకు కూడా అభిమానులు వెనకాడరు. ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నాయకుడే తెలంగాణ పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. 

25
Errabelli Dayakar Rao

ఇవాళ (మంగళవారం) మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పుట్టినరోజు. దీంతో తానేంతో అభిమానించే నాయకుడికి అదిరిపోయే భర్త్ డే గిప్ట్ ఇవ్వాలని కాకతీయ యూనివర్సిటీ జేఏసి వైస్ ఛైర్మన్, బిఆర్ఎస్ యువనాయకుడు మేడారపు సుధాకర్ భావించాడు. కానీ ఎంతవెతికినా మంత్రిపై అభిమానం ఏస్థాయిలో వుందో తెలియజేసే గిప్ట్ అతడికి కనిపించలేదు. 

35
Errabelli Dayakar Rao

తన నరనరాన ప్రవహిస్తున్న రక్తంలో ఎర్రబెల్లి దయాకరరావుపై అభిమానం దాగివుంది... దీన్నే ఎందుకు బహుమతిగా ఇవ్వకూడదని భావించినట్లున్నాడు సుధాకర్. వెంటనే తన రక్తంతో మంత్రి ఎర్రబెల్లి అద్భుతమైన ఫోటోను గీయించాడు. ఈ బ్లడ్ ఆర్ట్ చాలు సుధాకర్ మంత్రి ఎర్రబెల్లిని ఏ స్థాయిలో అభిమానిస్తున్నాడో తెలియజేయడానికి. 

45
Errabelli Dayakar Rao

పుట్టినరోజున మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును కలిసి విషెస్ తెలిపిన సుధాకర్ రక్తంతో గీసిన పోటోను బహూరించారు. ఆ ఫోటో ప్రేమ్ చూసి ఎమోషన్ అయిన మంత్రి సుధాకర్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జీవితంలో మరిచిపోలేని బహుమతి ఇచ్చిన అతడిని అభినందించడంతో పాటు ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. 

55
Errabelli Dayakar Rao

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు జన్మదినం తనకు పండగరోజు వంటిదని... ఈసారి ఎలాగయినా ఆయనకు అదిరిపోయే బహుమతి ఇవ్వాలని అనుకున్నానని మేడారపు సుధాకర్ తెలిపారు. అందుకే తన రక్తంతో ఫోటో గీయించి బహుమతిగా ఇచ్చానన్నాడు. అభిమానించే నాయకుడి కోసం రక్తం దారపోసినా ఏ బాధా కలగలేదని సుధాకర్ పేర్కొన్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories