అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

First Published | Aug 29, 2023, 10:47 AM IST

అభ్యర్థుల ఎంపికకు  కాంగ్రెస్ పార్టీ కసరత్తు  చేస్తుంది.  ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ హైద్రాబాద్ లో సమావేశం కానుంది.

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

ఈ ఏడాది  చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు  కాంగ్రెస్ పార్టీ  కసరత్తును  మరింత  ముమ్మరం చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  మంగళవారంనాడు హైద్రాబాద్ గాంధీభవన్ లో సమావేశం కానుంది.

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు  ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుండి  కాంగ్రెస్ పార్టీ  ధరఖాస్తులను స్వీకరించింది.ఈ నెల  18 నుండి  25వ తేదీ వరకు  ధరఖాస్తులను స్వీకరించారు. 119  అసెంబ్లీ నియోజకవర్గాలకు  1050 ధరఖాస్తులు అందాయి.  ఈ ధరఖాస్తులను  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  షార్ట్ లిస్ట్ చేయనుంది. 


అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా  ఎంతమంది అభ్యర్థులు  ధరఖాస్తు చేసుకున్నారనే విషయమై  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  జాబితా తయారు చేయనుంది.  అంతేకాదు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ముగ్గురు అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్  చేసి కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నారు

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

అయితే  ఈ ముగ్గురు  అభ్యర్థుల జాబితా ఆధారంగా  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పార్టీ పరిస్థితిపై  సర్వే నిర్వహించనుంది  కాంగ్రెస్ పార్టీ.  ఈ సర్వే రిపోర్టును కూడ  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  స్క్రీనింగ్ కమిటీకి అందించనుంది.  షార్ట్ లిస్టు చేసిన జాబితాతో పాటు  ఎన్నికల సర్వే ఫలితాలతో  రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  పర్యటించనుంది.క్షేత్రస్థాయిలో ఉన్న  పరిస్థితులు  సర్వే ఫలితాలు, అభ్యర్థుల బలాబలాలను  సమీక్షించి ఒక్క అభ్యర్థి పేరును  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్  కమిటీ ఎన్నికల కమిటీకి  ఆ పేరును పంపనుంది.  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ  అభ్యర్థుల జాబితాను  ప్రకటించనుంది.

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

ఇదిలా ఉంటే  రాష్ట్రంలోని  119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  42 అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాలని ఆ పార్టీలోని బీసీ నేతలు కోరుతున్నారు.  అయితే  35 సీట్లను కేటాయించేందుకు  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందని సమాచారం.   ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు బీసీ అభ్యర్థులకు టిక్కెట్లను కేటాయించాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది. 

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

ఈ ఏడాది సెప్టెంబర్ మూడో వారంలో  అభ్యర్థులను  ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది. ఈ లోపుగా  పలు అంశాలపై డిక్లరేషన్లు, మేనిఫెస్టోను  కూడ విడుదల చేయాలని  కాంగ్రెస్ పార్టీ  భావిస్తుంది.  ఈ ఏడాది సెప్టెంబర్  17న  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు  ఆ పార్టీ ప్లాన్ చేసుకుంది. ఈ లోపుగా  మిగిలిన డిక్లరేషన్లను కూడ ప్రకటించనున్నారు.సోనియాగాంధీ చేతుల మీదుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయించనుంది.
 

అభ్యర్థుల ఎంపికకు తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు: నేడు ఎన్నికల కమిటీ భేటీ

ఇప్పటికే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  115 మందితో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.  బీజేపీ కూడ  అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.ఈ మేరకు ఆ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్ మాసంలోనే  అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసే కంటే ముందే  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావిస్తుంది.

Latest Videos

click me!