కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

First Published | Aug 24, 2023, 5:04 PM IST

కేసీఆర్ కేబినెట్ లో  పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కింది.  మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవడం ద్వారా  కాంగ్రెస్ కు పరోక్షంగా కేసీఆర్ షాకిచ్చారు.

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  కేసీఆర్ మంత్రివర్గంలోకి  పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డికి మంచి పట్టుంది.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా  మహేందర్ రెడ్డి పనిచేశారు.  రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గా మహేందర్ రెడ్డి  భార్య పనిచేశారు. ప్రస్తుతం  ఆమె వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి  కొడంగల్ ఎమ్మెల్యేగా  ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్


2018 ఎన్నికల్లో తాండూరు నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన పట్నం మహేందర్ రెడ్డి  కాంగ్రెస్ అభ్యర్ధి పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు.కాంగ్రెస్ నుండి  గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. దీంతో  తాండూరులో  పట్నం మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి వర్గాలుగా బీఆర్ఎస్ చీలిపోయింది.

Latest Videos


కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

నియోజకవర్గంలో ఆదిపత్యం కోసం ఇద్దరు నేతలు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో  ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండేది. ఇద్దరు నేతలు  తాండూరు నుండి  పోటీకి  రంగం సిద్దం  చేసుకున్నారు. సిట్టింగ్ లకే  ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ నాయకత్వం  హామీ ఇచ్చింది.

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్


ఈ తరుణంలో కాంగ్రెస్ కీలక నేతలు కొందరు  పట్నం మహేందర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు.  కాంగ్రెస్ పార్టీలో  చేరాలని ఆహ్వానించారు. అయితే  మహేందర్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ స్థానాలను  కోరినట్టుగా ప్రచారం సాగింది. చేవేళ్ల, తాండూరు, మహేశ్వరం, వికారాబాద్, చేవేళ్ల ఎంపీ స్థానాన్ని  కాంగ్రెస్ ను కోరినట్టుగా  ప్రచారం సాగింది. అయితే  ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం స్థానిక నేతలతో చర్చించిందనే ప్రచారం కూడ లేకపోలేదు. కాంగ్రెస్ ను దెబ్బకొట్టడంతో  పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ నాయకత్వం పావులు కదిపింది. వెంటనే ఆ పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది పట్నం  మహేందర్ రెడ్డితో  బీఆర్ఎస్ నాయకత్వం  చర్చలు జరిపింది. 

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

పట్నం సోదరులను వదులుకొంటే  పార్టీకి నష్టమని బీఆర్ఎస్ నాయకత్వం భావించింది. ఈ తరుణంలో కాంగ్రెస్ కంటే మంచి ఆఫర్ ను బీఆర్ఎస్ నాయకత్వం  చూపింది. మంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చింది. మరో వైపు ఎన్నికల తర్వాత  కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటైతే  పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవిని కొనసాగించనున్నట్టుగా హామీ లభించింది. దీంతో మహేందర్ రెడ్డి  సంతృప్తి చెందారు. 

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

దీంతో  కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనను పట్నం మహేందర్ రెడ్డి వెనక్కి తగ్గారని చెబుతున్నారు.  మంత్రి పదవిని ఇస్తే  తాండూరు నుండి  పోటీ విషయంలో రాజీకి కూడ  పట్నం మహేందర్ రెడ్డి అంగీకరించారు.   ఇవాళ  రాజ్ భవన్ లో పట్నం మహేందర్ రెడ్డి  మంత్రిగా ప్రమాణం చేశారు. 

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

2018 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.  ఆయన సతీమణికి  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవిని ఇచ్చింది. కానీ తాండూరులో  తన పట్టును కోల్పోకుండా ఉండేందుకు  మహేందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు.ఈ క్రమంలోనే  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి, మహేందర్ రెడ్డికి మధ్య  ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.  

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్


2014 ఎన్నికలకు ముందు  కూడ పట్నం మహేందర్ రెడ్డి సోదరులను టీడీపీ నుండి బీఆర్ఎస్ లో చేరాలని  పలు దఫాలు ఆ పార్టీ చర్చలు జరిపింది. అయితే  ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు  టీడీపీకి పట్నం మహేందర్ రెడ్డి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ లో చేరారు. 

కేసీఆర్ కేబినెట్‌లోకి పట్నం: కాంగ్రెస్ కు చెక్, పైచేయి సాధించిన బీఆర్ఎస్

ప్రస్తుతం  కేసీఆర్ కేబినెట్ లో  ఉన్న  సబితా ఇంద్రారెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి సమీప బంధువు. ప్రస్తుత కేసీఆర్ కేబినెట్ లో వీరిద్దరికి చోటు దక్కింది. పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు రాజేందర్ రెడ్డి  రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవారు.  ఆయన అకాల మరణంతో  పట్నం మహేందర్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు.  ఇంద్రారెడ్డి  టీడీపీ నుండి కాంగ్రెస్ లో చేరినా  పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం టీడీపీలో ఉంది.  2018 ఎన్నికల తర్వాత సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. పట్నం మహేందర్ రెడ్డి కుటుంబం కూడ బీఆర్ఎస్ లో ఉంది.  
 

click me!