నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

First Published | Aug 25, 2023, 4:50 PM IST

హైద్రాబాద్ లోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీకి  కాంగ్రెస్ నేత మధు యాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు.

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  మధు యాష్కీ  కాంగ్రెస్ అభ్యర్థిగా  ప్రాతినిథ్యం వహించారు.వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసేందుకు మధు యాష్కీ ఆసక్తిని చూపుతున్నారు.ఈ మేరకు  ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం  మధు యాష్కీ శుక్రవారంనాడు ధరఖాస్తు చేసుకున్నారు.

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

అమెరికా నుండి  వచ్చిన  మధు యాష్కీ  అనూహ్యంగా కాంగ్రెస్ టిక్కెట్టు దక్కించుకొని  2004లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  విజయం సాధించారు. నిజామాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు ఆనాడు ఉన్న నల్గొండ ఎంపీ స్థానంపై కూడ ఆయన కేంద్రీకరించారు. అయితే  చివరికి  నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ నాయకత్వం కేటాయించింది. నిజామాబాద్ నుండి ఆయన విజయం సాధించారు.  2009 లో కూడ  ఆయన  నిజామాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో తెలంగాణ విషయమై కాంగ్రెస్ పార్టీలో మాట్లాడిన నేతల్లో  మధు యాష్కీ ఒకరు

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి మధుయాష్కీ  మరోసారి  పోటీ చేశారు అయితే  బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత చేతిలో  మధు యాష్కీ  ఓటమి పాలయ్యారు.  దీంతో  నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  కాకుండా ఇత ర నియోజకవర్గాల్లో పోటీ చేయాలని  మధు యాష్కీ ప్రయత్నాలు ప్రారంభించారు. 

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం  మధు యాష్కీ స్వగ్రామం. దీంతో  భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కూడ పోటీ చేయాలని  మధు యాష్కీ ప్రయత్నాలు ప్రారంభించారు.  2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడ  భువనగిరి నుండి పోటీ చేయాలని మధు యాష్కీని  కోమటిరెడ్డి బ్రదర్స్ కోరినట్టుగా మధు యాష్కీ గతంలో ప్రకటించారు.  భువనగిరి నుండి పోటీ చేయడానికి కూడ  మధు యాష్కీ ప్రయత్నాలు ప్రారంభించారు.

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

నిజామాబాద్ ను సీనియర్లు వీడిచి పెట్టి పోతే  క్యాడర్ లో  నిరాశ నెలకొంటుందని  మాజీ మంత్రి షబ్బీర్ అలీ  భువనగిరి నుండి పోటీ చేయవద్దని సూచించారు. నిజామాబాద్ లోనే పోటీ చేయాలని  మధు యాష్కీకి సూచించారు. దీంతో  మధు యాష్కీ  అయిష్టంగానే  2019 ఎన్నికల్లో  నిజామాబాద్ నుండి పోటీ చేశారు. నామినేషన్ దాఖలు చేశారు. ప్రచారం కూడ సరిగా చేయలేదు.

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

కవితను ఓడించాలనే లక్ష్యంతో  క్షేత్రస్థాయిలో  కాంగ్రెస్, బీజేపీలు  కలిసి పనిచేశాయని అప్పట్లో బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలకు బలం  చేకూరేలా ఎన్నికల ఫలితం వచ్చింది.  నిజామాబాద్ నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధి  కల్వకుంట్ల కవిత ఓటమి పాలై బీజేపీ అభ్యర్ధి అరవింద్ విజయం సాధించారు.

నిజామాబాద్‌కు యాష్కీ దూరం: నాడు భువనగిరి... నేడు ఎల్‌బీనగర్, లక్కు దక్కేనా?

 నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీకి  మరోసారి  మధు యాష్కీ ఆసక్తిగా లేరు. ఈ దఫా ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీకి  మధు యాష్కీ ధరఖాస్తు చేసుకున్నారు.  అయితే కాంగ్రెస్ పార్టీ  మధు యాష్కీకి ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తుందా లేదా  అనేది  త్వరలోనే తేలనుంది.

Latest Videos

click me!