Published : Sep 13, 2025, 10:21 AM ISTUpdated : Sep 13, 2025, 10:27 AM IST
Colleges Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్థల యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఇవాళ్టి నుండి వరుసగా నాల్రోజులు సెలవులు వస్తున్నాయి. ఏఏ విద్యాసంస్థలకు సెలవులు?
Colleges Bandh : తెలంగాణలో మరోసారి విద్యాసంస్థల యాజమాన్యాలు ఆందోళనబాట పట్టాయి. ప్రభుత్వ తీరుతో చాలా ఇబ్బంది పడుతున్నామని... వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ వృత్తివిద్యా కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఎంబిఏ కాలేజీలతో పాటు అన్ని వృత్తివిద్యా కాలేజీల యాజామాన్యాలు సెప్టెంబర్ 15న బంద్ ప్రకటించాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ (FATHI) కీలక నిర్ణయం తీసుకుంది.
25
ఏ కాలేజీలు బంద్?
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కాలేజీల బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. నగరంతో పాటు శివారుప్రాంతాల్లో వందలాది వృత్తివిద్యా కాలేజీలున్నాయి... మరీముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలు అధికంగా ఉన్నాయి. వీటితోపాటు మేనేజ్మెంట్ కాలేజీలు (ఎంబిఏ), బి.ఈడి, నర్సింగ్, పారామెడికల్, లా కాలేజీలు కూడా అనేకం ఉన్నాయి. వీటిలో లక్షలాదిమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ కాలేజీలన్ని సోమవారం బంద్ కానున్నాయి.
35
డిగ్రీ కాలేజీలు కూడా బంద్
రాష్ట్రంలోని డిగ్రీ, పిజి కాలేజీ యాజమాన్యాలు కూడా బంద్ కు మద్దతు తెలిపాయని చెబుతున్నారు... అంటే ఈ కాలేజీలు కూడా బంద్ పాటించనున్నాయి. అయితే డిగ్రీ, పిజి కాలేజీలు సెప్టెంబర్ 16 నుండి బంద్ లో పాల్గొననున్నాయని ఆ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి ప్రకటించారు. ఈ కాలేజీలకు కూడా ప్రభుత్వం భారీగానే ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.
ఇలా రాష్ట్రంలోని చాలా కాలేజీలు సోమవారం బంద్ కానున్నాయి... ఇది ఎప్పటివరకు కొనసాగుతోంది మాత్రం క్లారిటీ లేదు. ప్రభుత్వ స్పందన, కాలేజీ యాజమాన్యాల నిర్ణయంపై బంద్ ఎప్పటివరకు అన్నది ఆధారపడి ఉంటుంది. అయితే సోమ, మంగళవారం మాత్రం కాలేజీల బంద్ కొనసాగుతుంది.
అయితే ఈ కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రియింబర్స్ మెంట్ కింద భారీగా చెల్లించాల్సి ఉంది. కానీ సకాలంలో ఈ డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో వెంటనే ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 15 (సోమవారం) బ్లాక్ డే గా ప్రకటించారు... ఆరోజు నుండి నిరవధిక కాలేజీ బంద్ పాటిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం తమకు రూ.8,000 కోట్ల ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చెబుతోంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ భారంగా మారిందని... దీంతో విద్యారంగం సంక్షోభంలో పడే ప్రమాదం నెలకొందని అంటున్నాయి. కాబట్టి వెంటనే ఈ ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిల్లో సగం అయినా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
55
కాలేజీ యాజమాన్యాల డిమాండ్స్ ఇవే
ఈ దసరా లోపు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల్లో కనీసం 60 శాతం అయినా విడుదల చేయాలని తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇచ్చాకే కాలేజీల నిరవధిక బంద్ ను నిలిపివేస్తామని చెబుతున్నారు.
ఇకపై క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో ఫీజు రియింబర్స్మెంట్ నిధలు విడుదల చేయాలని కోరుతున్నారు. అలా అయితేనే కాలేజీల నిర్వహణ సాఫీగా సాగుతుందని... విద్యార్థులకు కూడా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలంటే ప్రభుత్వ సహకారం అవసరమని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యెర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అంటోంది.