CM Revanth: ధరణికి బాయ్ బాయ్.. భూభారతికి జై.. పోర్టల్ ప్రారంభంపై రేవంత్ హాట్ కామెంట్స్!
Bhoobharathi Portal: తెలంగాణలో సాగు భూముల రిజిస్ట్రేషన్లు- మ్యుటేషన్ల సేవల ధరణి పోర్టల్‌ను తీసివేసి ఆ స్ఠానంలో భూభారతి పోర్టల్‌ను రేవంత్ సర్కార్ తీసుకొచ్చింది. ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి పోర్టల్ ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో నాలుగు మండలాల్లో భూభారతి పోర్టల్‌ను పైలెట్ ప్రాజెక్టు సేవలను కొనసాగించనున్నారు. నారాయణపేట జిల్ల మద్దూరు, కామారెడ్డిలోని లింగంపేట, ములగులోని వెంకటాపూర్, ఖమ్మంలోని నేలకొండపల్లి మండలాలను రేవంత్ ఎంపిక చేశార. అయితే.. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో పోర్టల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అప్పటివరకు పోర్టల్ పనితీరుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేయనున్నారు. అయితే.. ధరణి తొలగించడానికి కారణాలు ఇలా..