Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ... కొత్తమంత్రులు వీరేనా?

Published : May 26, 2025, 03:58 PM ISTUpdated : May 26, 2025, 04:17 PM IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం డిల్లీలోనే ఉండటం, కాంగ్రెస్ పెద్దలను కలుస్తుండటంతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మంత్రులుగా ఎవరికి అవకాశం దక్కవచ్చంటే… 

PREV
15
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం ఫిక్స్

Telangana Cabinet Expansion : తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు మూహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం డిల్లీలోనే ఉన్నారు. వీరిద్దరు కేబినెట్ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పుపై అదిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

25
డిల్లీలోనే రేవంత్ మకాం.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?

నీతి ఆయోగ్ 10వ పాలకమండలి సమావేశం మే 24 (శనివారం) జరిగింది... ఇందులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులతో పాటు అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం అనంతరం అన్నిరాష్ట్రాల సీఎంలు తమతమ రాష్ట్రాలకు వెళ్ళిపోయారు... రేవంత్ రెడ్డి కూడా ఆదివారమే తిరిగిరావాల్సి ఉంది. కానీ ఆయన షెడ్యూల్ సడన్ గా మారి డిల్లీలోనే ఉండిపోవడం, పార్టీ పెద్దలతో చర్చలు జరపడంతో మరోసారి కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణపై చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని... ఇప్పటికే మంత్రివర్గంలో మార్పుచేర్పులపై నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది. మరోసారి డిల్లీ పెద్దలతో చర్చించాక మంత్రివర్గ విస్తరణపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.  ఇది ఇవాళ(సోమవారం) సాయంత్రం ఉంటుందని ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది.

35
రేవంత్ వద్దగత మంత్రిత్వ శాఖలెన్ని?

ప్రస్తుతం తెలంగాణలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. హోం, విద్యాశాఖ వంటి కీలక శాఖలన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి. వీటికోసం చాలామంది ఆశావహులు పోటీలో ఉన్నారు... ఎవరికి వారు తమతమ మార్గాల ద్వారా మంత్రివర్గంలో చోటుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఏకంగా సీఎం రేవంత్, రాష్ట్రంలోని ఇతర పెద్ద నాయకులను కాదని నేరుగా కాంగ్రెస్ అదిష్టానంవద్దే తేల్చుకుంటున్నారు. దీంతో కేబినెట్ విస్తరణ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది.

45
మంత్రుల లిస్ట్ రెడీ

ఎమ్మెల్యేల నుండి వచ్చిన వినతులను అదిష్టానంకు వివరించిన సీఎం రేవంత్ తన చాయిస్ ఎవరో తెలిపినట్లు సమాచారం. ఇక సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారి అభిప్రాయాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత జిల్లాలు, సామాజికవర్గాలు, ఇతర సమీకరణలు పరిగణలోకి కొందరి పేర్లను ఖరాను చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

55
మంత్రివర్గంలో చోటుదక్కేది వీరికేనా?

మంత్రివర్గ విస్తరణలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్. ఇక నిజామాబాద్ జిల్లానుండి సుదర్శన్ రెడ్డి, రంగారెడ్డి నుండి మల్ రెడ్డి రంగారెడ్డి, ఆదిలాబాద్ నుండి ప్రేమ్ సాగర్ రావు, కరీంనగర్ నుండి ఆది శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి.మైనారిటీ కోటాలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, ఆమేర్ అలీ ఖాన్ లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. ఎస్టీ కోటాలో బాలూ నాయక్, శంకర్ నాయక్, మహిళా కోటాలో విజయశాంతి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ లిస్ట్ లోని వారిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందో చూడాలి. కాంగ్రెస్ అదిష్టానం అనూహ్య నిర్ణయమేదైనా తీసుకుంటే ఎవరూ ఊహించనివారికి కూడా మంత్రిపదవి దక్కవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories