Rain Alert: వ‌చ్చే 5 రోజులు వాన‌లే వాన‌లు.. ఈ జిల్లాల వాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే

Published : May 25, 2025, 06:57 AM IST

ఎండ‌కాలం దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల‌ను ఈసారి రుతుప‌వ‌నాలు ముందుగానే ప‌ల‌క‌రించ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో వ‌చ్చే రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. 

PREV
15
భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణలో వచ్చే ఐదు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకినట్టు పేర్కొంది. రెండు నుంచి మూడు రోజుల్లో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఈ రుతుపవనాలు విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపింది.

25
తక్కువ ఉష్ణోగ్రతలు న‌మోదు కానున్నాయి:

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి ఐదు నుంచి ఏడు డిగ్రీల వరకూ తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. విస్తారంగా వ‌ర్షాలు కుర‌వ‌డం వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

35
ఏపీలో వ‌ర్షాలు కురిసే జిల్లాలు:

అరేబియా సముద్రంలోని వాయుగుండం ప్రభావంతో ఆదివారం ఏపీలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరుగా, సోమవారం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

45
తెలంగాణ విష‌యానికొస్తే

తెలంగాణ‌లో ఆదివారం ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. అలాగే సోమ‌వారం నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది.

మంగ‌ళ‌వారం కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే సూచన ఉంది.

55
28వ తేదీ కూడా

28వ తేదీన ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories