Telangana assembly elections 2023: శానంపూడి సైదిరెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢీ

Published : Aug 24, 2023, 09:38 AM IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించగా కాంగ్రెస్, బిజెపి లు కూడా అభ్యర్థుల లిస్ట్ రెడీ చేస్తున్నారు. ఇలా ఈసారి హుజూర్ నగర్ లో శానంపూడి సైదిరెడ్డిపై మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ బరిలోకి దిగడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. 

PREV
14
Telangana assembly elections 2023: శానంపూడి సైదిరెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢీ
uttam kumar reddy

హుజూర్ నగర్: వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూర్ నగర్ శాసనసభ స్థానంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై పోటీ చేయడానికి తెలంగాణ పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని ఓడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. గత రెండేళ్లుగా ఆయన హుజూర్ నగర్ లోనే కాకుండా కోదాడ నియోజకవర్గంలో కూడా ప్రజలను కలుస్తూ వస్తున్నారు.

24
Saidireddy vs uttam padmavathi

తాను హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తానంటూ ఇటీవల ఆయన పార్టీ కార్యకర్తలతో చెప్పారు. హుజూర్ నగర్ నుంచి ఆయన మూడు సార్లు వరుసగా విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన హుజూర్ నగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత హుజూర్ నగర్ కు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతి పోటీ చేసి బిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై ఓటమి పాలయ్యారు.

34
Uttam kumar Reddy

కాగా, తన సతీమణి పద్మావతి కోదాడ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. ఆమె కోదాడ నుంచి 2014లో శాసనసభకు ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ చేతిలో ఓడిపోయారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 1994 ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చందర్ రావు చేతిలో ఓడిపోయారు.క కోదాడ నుంచి ఉత్తమ్ కుామర్ రెడ్డి 1999, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు.

44
uttam kumar reddy

ఉత్తమ్ కుమార్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరుతారంటూ ఇటీవల ప్రచారం సాగింది. అయితే, ఆ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

click me!

Recommended Stories