నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
మెదక్, మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాల్లో తనతో పాటు తన కొడుకు రోహిత్ పోటీ కోసం మైనంపల్లి హన్మంతరావు కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. అయితే మెదక్ నుండి తన కొడుకు రోహిత్ కు టిక్కెట్టు కోసం మైనంపల్లి హన్మంతరావు ప్రయత్నించారు. కానీ రోహిత్ కు టిక్కెట్టు దక్కలేదు. దీంతో మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు.
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 2009లో మెదక్ నుండి మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2014 నుండి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి మైనంపల్లి హన్మంతరావు పోటీకి రంగం సిద్దం చేసుకున్నారు.
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
2014లో ఎన్నికలు జరిగే సమయానికి రాష్ట్ర విభజన జరగలేదు. కానీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరింది. ఈ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. తెలంగాణలో పొత్తు విషయమై మల్కాజిగిరి సీటు విషయంలో పీటముడి నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కోసం బీజేపీ నేతలు మల్కాజిగిరి సీటు కోసం పట్టుబట్టారు. ఈ సీటు ఇవ్వకపోతే పొత్తు వద్దని తేల్చి చెప్పారు. అయితే అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్కాజిగిరి సీటును బీజేపీకి వదిలిపెట్టారు చంద్రబాబు
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
అయితే మల్కాజిగిరి అసెంబ్లీ సీటు కోసం మైనంపల్లి హన్మంతరావు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. వేరే సీటు ఇచ్చేందుకు టీడీపీ ప్రయత్నించినా కూడ బీజేపీ నిరాకరించింది. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థిగా రామచంద్రరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీలో టిక్కెట్టు దక్కకపోవడంతో కేటీఆర్ మైనంపల్లి హన్మంతరావుకు ఫోన్ చేసి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. 2014లో మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ లోచేరారు. అయితే మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్టు ఇచ్చారు
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
2014 లో మైనంపల్లి హన్మంతరావు టీడీపీ అభ్యర్థి మల్లారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత బీఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షుడిగా మైనంపల్లి హన్మంతరావు పనిచేశారు. 2018లో మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నిన్న కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లి హన్మంతరావుకు చోటు దక్కింది.అయితే మెదక్ నుండి తన కొడుకు రోహిత్ కోసం హన్మంతరావు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ హన్మంతరావుకు నిరాశే ఎదురైంది.
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
టీడీపీలో ఉన్న సమయం నుండి హరీష్ రావుకు మైనంపల్లి హన్మంతరావుకు పొసగదు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత కూడ వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. మెదక్ లో రోహిత్ కోసం హన్మంతరావు ప్రయత్నాలకు హరీష్ రావు చెక్ పెట్టాడనే అసంతృప్తి ఉంది. దీంతో నిన్న తిరుపతిలో హరీష్ రావుపై మైనంపల్లి హన్మంతరావు సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ కూడ ఖండించారు.
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
మెదక్, మల్కాజిగిరిలలో పోటీ చేయాలనే యోచనలో హన్మంతరావు, ఆయన తనయుడు రోహిత్ ఉన్నారు. ఈ రెండు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ లో చేరాలని మైనంపల్లి హన్మంతరావు భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది. మైనంపల్లి హన్మంతరావు తన అనుచరులతో ఈ విషయమై చర్చించనున్నారు. మెదక్, మల్కాజిగిరిలలో ఉన్న తన అనుచరులతో సమావేశమై ఈ విషయాలపై చర్చించనున్నట్టుగా మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు
నాడు మల్కాజిగిరి, నేడు మెదక్ కోసం: మైనంపల్లి పయనమెటు?
బీఆర్ఎస్ ను వీడేందుకు మైనంపల్లి హన్మంతరావు రంగం సిద్దం చేసుకున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ రెండు స్థానాలకు చెందిన కార్యకర్తలతో సమావేశమైన తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని మైనంపల్లి హన్మంతరావు తేల్చి చెప్పారు.