నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

First Published | Aug 23, 2023, 10:37 AM IST

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రాజకీయం కొనసాగుతుంది. తాజాగా కేసీఆర్ ప్రకటించిన  బీఆర్ఎస్ జాబితాలో  పాలేరు టిక్కెట్టు తుమ్మల నాగేశ్వరరావుకు దక్కలేదు.

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

 మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  పాలేరు అసెంబ్లీ కేంద్రంగా  రాజకీయాలు కొనసాగిస్తున్నారు.  2009 ఎన్నికల తర్వాత  తుమ్మల నాగేశ్వరరావు  పాలేరు అసెంబ్లీపై  కన్నేశారు.  2016లో  ఈ స్థానం నుండి  తుమ్మల నాగేశ్వరరావు  విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

2023 ఎన్నికల్లో పాలేరు  అసెంబ్లీ స్థానం నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా   పోటీ చేయాలని  తుమ్మల నాగేశ్వరరావు ప్లాన్ చేసుకున్నారు.  కానీ, కేసీఆర్  మాత్రం  తుమ్మల నాగేశ్వరరావుకు  షాకిచ్చారు.  పాలేరు నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే  కేసీఆర్ బీఆర్ఎస్ టిక్కెట్టును కేటాయించారు. దీంతో  ఈ నెల  22న  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు  సమావేశమయ్యారు.  


నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2009 అసెంబ్లీ ఎన్నికల్లో  ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి  తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ అభ్యర్ధిగా  పోటీ చేసి విజయం సాధించారు.   అయితే 2009 అసెంబ్లీ ఎన్నికల తర్వాత  పాలేరు  అసెంబ్లీ నియోజకవర్గంపై  తుమ్మల నాగేశ్వరరావు  ఫోకస్ పెట్టారు. 2014 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేయాలని  తుమ్మల నాగేశ్వరరావు  ప్లాన్ చేసుకున్నారు

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

2014 ఎన్నికల్లో  పాలేరు  సీటు  కోసం తుమ్మల నాగేశ్వరరావు  ప్రయత్నించారు. అయితే పాలేరులో  తుమ్మల నాగేశ్వరరావు  పోటీ చేయడాన్ని  అప్పటి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యతిరేకించారు. పాలేరు నుండి  తన వర్గానికి చెందిన  ఎంబీ స్వర్ణకుమారికి నామా నాగేశ్వరరావు  టిక్కెట్టు  ఇప్పించారు. అయితే  దీంతో  తుమ్మల నాగేశ్వరరావు  అనివార్యంగా ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేశారు. అయితే  ఈ ఎన్నికల్లో  ఖమ్మం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలోకి దిగిన పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో  తుమ్మల  నాగేశ్వరరావు  ఓటమి పాలయ్యాడు.  

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

2014 లో  ఎన్నికలు పూర్తైన తర్వాత రాష్ట్ర విభజన జరిగింది.  ఈ సమయంలో  తెలంగాణలో  కేసీఆర్ నాయకత్వంలో  బీఆర్ఎస్  అధికారం కైవసం చేసుకుంది. టీడీపీలో ఉన్న సమయంలో  తుమ్మల నాగేశ్వరరావు, కేసీఆర్,  బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మధ్య మంచి స్నేహం ఉండేది. దీంతో  కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. 

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

తుమ్మల నాగేశ్వరరావు కూడ  కేసీఆర్ ఆఫర్ ను మన్నించి  బీఆర్ఎస్ లో చేరారు.  కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తుమ్మల నాగేశ్వరరావును  తీసుకున్నారు.  అయితే  ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీని కట్టబెట్టారు కేసీఆర్. 

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

2014  అసెంబ్లీ ఎన్నికలు జరిగిన  కొంత కాలానికే   పాలేరు నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి అనారోగ్యంతో  మృతి చెందాడు. దీంతో  పాలేరు అసెంబ్లీ స్థానానికి  ఉప ఎన్నిక జరిగింది.ఈ ఉప ఎన్నికల్లో పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్థి  రాంరెడ్డి  వెంకట్ రెడ్డి సతీమణిపై విజయం సాధించారు.  

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

2018  అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్ధిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేసి  కాంగ్రెస్ అభ్యర్ధి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెట్టింది.  పాలేరు నుండి  కాంగ్రెస్ నుండి విజయం సాధించిన కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు.  దీంతో  పాలేరులో  తుమ్మల నాగేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి వర్గాలుగా   బీఆర్ఎస్ చీలిపోయిన పరిస్థితి నెలకొంది. 

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

ఈ ఏడాది చివర్లో జరిగే  అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుండి  పోటీకి తుమ్మల నాగేశ్వరరావు రంగం సిద్దం  చేసుకుంటున్నారు. అయితే  ఈ నెల  21న ప్రకటించిన జాబితాలో  తుమ్మల నాగేశ్వరరావుకు  చోటు దక్కలేదు.  సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి  సీటు దక్కడంతో  తుమ్మల నాగేశ్వరరావు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

నాడు టీడీపీ, నేడు బీఆర్ఎస్‌:పాలేరు చుట్టే తుమ్మల రాజకీయం

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి ఆహ్వానాలు అందినట్టుగా ప్రచారం సాగుతుంది.  అయితే  తుమ్మల నాగేశ్వరరావు  ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనేది  ప్రస్తుతం చర్చ సాగుతుంది. అయితే  ఏ పార్టీలో చేరినా పాలేరు అసెంబ్లీ స్థానం నుండి  పోటీ విషయమై  ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు దృష్టి కేంద్రీకరించినట్టుగా సమాచారం.

Latest Videos

click me!