Published : Jul 01, 2025, 08:07 AM ISTUpdated : Jul 01, 2025, 08:46 AM IST
జూలై నెల వస్తూనే వానలు మోసుకువచ్చింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటే…
Telugu States Weather Update : తెలుగు ప్రజల ఎదురుచూపులకు తెరపడినట్లే కనిపిస్తోంది... గత రెండుమూడు రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. సోమవారం అయితే తెలంగాణలో రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో నాలుగైదు గంటలపాటు వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించి ఆనందాలను నింపాయి.
రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అయితే గత రెండుమూడు రోజులుగా చిరుజల్లులతో ప్రారంభమైన వర్షాలు మరింత జోరందుకుని ఇప్పుడు భారీ వర్షాలుగా మారుతున్నాయి.
25
జూలై 1 తెలంగాణ వాతావరణం
ఇవాళ(మంగళవారం) తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలవగా మరికొన్ని ప్రాంతాలకు ఇవాళ వర్షాలు వ్యాపించే అవకాశాలున్నట్లు తెలిపారు. మొత్తంగా మంగళవారం కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
35
హైదరాబాద్ లో జోరువానలు
హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. నిన్న సాయంత్రం మొదలైన వర్షం అర్దరాత్రి వరకు కొనసాగింది... ఇది ఇవాళ కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శివారులోని రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటిచింది.
రుతుపవనాలు, సముద్రాల్లో ఆవర్తనాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు జోరందుకుంటున్నాయి. ఇవాళ (మంగళవారం) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే బలమైన ఈదురుగాలులతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబటి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు.. తీర ప్రాంతంలో నివాసముండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
55
నేడు ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు
ఇవాళ(మంగళవాారం) ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖసపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయట. వర్షాలతో ప్రమాదం లేదు కానీ ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి… కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.