ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ముఖ్యంగా తూర్పు తీరప్రాంతాలు, రాయలసీమపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా ప్రెస్ నోట్ ప్రకారం.. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలోని రుందవరంలో 9 సెం.మీ, అళూరు, చిత్తూరులో 8 సెం.మీ, అనంతపురంలోని గుంటకల్ లో 7 సెం.మీ ల వర్షపాతం నమోదైంది. అలాగే..
తూర్పు గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. మరో మూడు రోజులు అంటే.. ఆగస్టు 6 నుంచి 9 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. సముద్ర తీరం వెంబడి 40-50 కి.మీ/గంట వేగంతో గాలులు వీసే అవకాశం అవకాశముంది.