తెలంగాణలో సెలవులే సెలవులు :
తెలంగాణ ప్రభుత్వం 2025 ఆరంభంలోనే సెలవుల జాబితాను ప్రకటించింది. సాధారణంగా పండగలు, ప్రత్యేక రోజుల్లో తప్పనిసరిగా ఇచ్చే సెలవులతో పాటు అవసరం మేరకు ఇచ్చే ఆప్షనల్ హాలిడేస్ ను కూడా ప్రకటించింది. ఇందులో ఏప్రిల్ నెలలో వచ్చే సెలవుల గురించి తెలుసుకుందాం.
ఇప్పటికే ఏప్రిల్ 1న రంజాన్ తర్వాతిరోజు సెలవు వచ్చింది. ఇక ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సెలవులు ముగిసాయి. మరో మూడ్రోజులు ముగియగానే అంటే ఏప్రిల్ 10న ఇంకో హాలిడే వస్తోంది. ఈ గురువారం మహవీర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే ఇచ్చింది.
శుక్రవారం అంటే ఏప్రిల్ 11 ఒక్కరోజు మేనేజ్ చేసుకుంటే తర్వాత మూడ్రోజులు సెలవులే. ఏప్రిల్ 12న రెండో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు. ఏప్రిల్ 13న ఆదివారం కాబట్టి సాధారణ సెలవు. ఇక సాప్ట్ వేర్ ఉద్యోగులతో పాటు పలు కార్పోరేట్ సంస్థల ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారం రెండ్రోజులు సెలవులే.
ఏప్రిల్ 14న (సోమవారం) రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా ఈరోజు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అంటే వరుసగా మూడ్రోజులు విద్యార్థులతో పాటు ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. మధ్యలో శుక్రవారం ఒక్కరోజు లీవ్ తీసుకుంటే వరుసగా ఐద్రోజులు సెలవులే సెలవులు.