sigachi industries : పాశమైలారం ప్రమాదంలో చనిపోయింది 37 లేక 55 మందా? ఈ కన్ఫ్యూజన్ కు కారణాలివే

Published : Jul 01, 2025, 10:33 AM ISTUpdated : Jul 01, 2025, 10:44 AM IST

సిగాచి ఇండస్ట్రీస్ లో ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇంకా ఎంతమంది చనిపోయారన్నది క్లారిటీ లేదు. ఎందుకు ఇంకా మృతుల సంఖ్యపై కన్ఫ్యూజన్ కొనసాగుతోందంటే…

PREV
16
సిగాచి ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య

sigachi industries : హైదరాబాద్ శివారులోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సిగాచి కంపెనీ రియాక్టర్ పేలుడు ఘటనలో 37 మంది చనిపోయినట్లు అధికారులు నిర్దారించాయి. మరో 35 మంది తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు... వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఈ సిగాచి పరిశ్రమలో పనిచేసే మరో 20 మంది ఆఛూకీ లభించడంలేదు. దీంతో వీరు రియాక్టర్ పేలుడుదాటికి కుప్పకూలిన అడ్మినిస్ట్రేషన్ భవనం శిథిలాల కింద ఉండివుంటారని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం SDRF, NDRF బృందాల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి… ఈ శిథిలాల తొలగింపు పూర్తయితే ఈ ప్రమాదంలో మొత్తం ఎంతమంది చనిపోయారో తేలనుంది.

ఇక సిగాచి కంపెనీ ప్రమాద సమయంలో మొత్తం 150 మంది కార్మికులు, ఉద్యోగులు విధులకు హాజరైనట్లు సమాచారం. వారిలో 50 నుండి 60 మందివరకు ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బైటపడ్డారు. మిగతావారిలో 30-35 మంది గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతావారంతా ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు.

ఇప్పటికే 37 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించగా ఇంకో 20 మందివరకు మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ఇలా ఈ ప్రమాదంలో 50-55 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు... శిథిలాల తొలగింపు తర్వాత ఎంతమంది చనిపోయారో తేలనుంది.

26
సిగాచి ప్రమాద మృతుల సంఖ్యపై ఎందుకీ కన్ఫ్యూజన్

సిగాచి పరిశ్రమలో ఉదయం సరిగ్గా ఉద్యోగులు, కార్మికులు విధులకు హాజరైన సమయంలోనే ప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలిన సమయంలో పరిశ్రమలో చాలామంది ఉన్నారు. ఈ పేలుడు దాటికి చెలరేగిన మంటల్లో అడ్మినిస్ట్రేషన్ భవనం కూడా కుప్పకూలింది... దీంతో హాజరు రిజిస్టర్ తో పాటు కీలక రికార్డులన్నీ కాలిబూడిదయ్యాయి. కాబట్టి ప్రమాద సమయంలో కంపెనీలో ఎంతమంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నారో ఖచ్చితమైన సమాచారం లభించడంలేదు.

ఇక ఈ రియాక్టర్ ఒక్కసారిగా భారీ విస్పోటనానికి గురవడంతో మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు సమయంలో ఏకంగా 700 నుండి 800 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు తెలుస్తోంది. దీంతో రియాక్టర్ సమీపంలోని చాలామంది కార్మికులు సజీవదహనం అయ్యారు. కాబట్టి ఎంతమంది చనిపోయారన్నది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక రియాక్టర్ పేలుడు దాటికి కుప్పకూలిన భవనం శిథిలాలకింద ఎంతమంది ఉన్నారో తెలియడంలేదు. ఇలా వివిధ కారణాలవల్ల ఈ సిగాచి ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు.

36
సిగాచి వైస్ ప్రెసిడెంట్ మృతి?

సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనలో కార్మికులు చనిపోగా... ఈ పేలుడు దాటికి అడ్మినిస్ట్రేషన్ భవనం కుప్పకూలడంతో ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో అందులో పనిచేసే ఉద్యోగులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఎల్ఎన్ గోవన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వైస్ ప్రెసిడెంట్ కంపెనీలో ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. ఆయన కారు అక్కడే ఉండటంతో గోవన్ కూడా భవన శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఆఛూకీ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రమాదం స్థలంలోని ఆయన కారు పూర్తిగా కాలిపోయింది.

46
సిగాచి ప్రమాద మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు

రియాక్టర్ పేలుడు దాటికి ఒక్కసారిగా భారీఎత్తున మంటలు చెలరేగి కార్మికులు కాలిబూడిదయ్యారు. దీంతో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు... దీని ఆధారంగానే మృతుల వివరాలను బైటపెట్టనున్నారు.

ఇప్పటికే పలు మృతదేహాలు గుర్తించినా ఎవరో గుర్తుపట్టలేనివిధంగా ఉన్నాయని సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది చెబుతున్నారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కార్మికులే ఉన్నారని... ఉద్యోగులు తక్కువమందే ఉండివుంటారని భావిస్తున్నారు. 

ఈ కంపెనీలో ఎక్కువగా తమిళనాడు, బిహార్, ఒడిశా, జార్ఖండ్ కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు... తమవారి ఆఛూకీ కోసం చాలామంది కార్మికుల కుటుంబసభ్యులు సిగాచి కంపెనీ వద్దకు చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

56
సిగాచి కంపెనీని సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రియాక్టర్ పేలుడు జరిగిన సిగాచి పరిశ్రమను పరిశీలించనున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని ఇకపై ఇలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నారు. ఇప్పటికే సీఎం రాక నేపథ్యంలో సిగాచి కంపనీ వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు... సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా సీఎం పర్యటన సాగనుంది.

ఇక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సింగాచి కంపెనీ కార్మికులను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. వారిద్వారా ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోనున్నారు. అలాగే డాక్టర్లతో మాట్లాడి వారి పరిస్థితి గురించి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని... ఆ ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు అండగా ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించనుంది.

66
సిగాచి ప్రమాదంపై పీఎం మోదీ రియాక్ట్... ఆర్థికసాయం ప్రకటన

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించినవారి కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేాశారు... మరణించినవారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ ఓ ప్రకటన ద్వారా తెలియజేసారు.

Read more Photos on
click me!

Recommended Stories