School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వారానికి 5 రోజులే స్కూల్స్.. శనివారం కూడా సెలవు? అసలు రీజన్ ఇదే

Published : Nov 09, 2026, 11:51 AM IST

School Holidays: తెలంగాణలో స్కూళ్లకు వారానికి 5 రోజులే తరగతులు నిర్వహించి, శనివారాలు సెలవు ఇవ్వాలని ఎంఎల్‌సీ మల్కా కొమరయ్య సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. ప్రభుత్వం దీనిపై కసరత్తులు చేసే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

PREV
15
శనివారం కూడా స్కూళ్లకు సెలవు.. స్కూల్ వేళలు మారబోతున్నాయా?

తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ఉన్న పాఠశాలలకు వారానికి ఐదు రోజులే పనిదినాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. శనివారాలను పూర్తిగా సెలవు దినాలుగా ప్రకటించాలని ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యుడు (ఎంఎల్‌సీ) మల్కా కొమరయ్య రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఎల్ నినో ప్రభావం, నీటి ఎద్దడి సమస్యలు, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ విజ్ఞప్తిని లేఖ రూపంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు.

25
శనివారం సెలవులకు బదులుగా రోజువారీ వేళల పెంపు

వారానికి ఐదు రోజులే స్కూళ్లు నిర్వహించడం వల్ల శనివారం కోల్పోయే పని గంటలను భర్తీ చేసేందుకు ఎంఎల్‌సీ ఒక పరిష్కారాన్ని చూపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజూ స్కూల్ వేళలను సుమారు 35 నుంచి 40 నిమిషాల పాటు పెంచాలని సూచించారు. ఈ సమయ సర్దుబాటు చేయడం వల్ల శనివారాలు సెలవులు ఇచ్చినా, విద్యార్థులకు అవసరమైన బోధనా గంటలు ఏమాత్రం తగ్గవు. హైదరాబాద్, ఇతర జిల్లాల్లోని స్కూళ్లలో సిలబస్ సకాలంలో పూర్తవుతుందని ఆయన అన్నారు.

35
నీటి సంరక్షణ.. కాలుష్య నియంత్రణ ప్రయోజనాలు

ఐదు రోజుల స్కూల్ విధానం వల్ల అనేక అనుకూల ఫలితాలు ఉంటాయని ఎంఎల్‌సీ వివరించారు. శనివారం సెలవు ఇవ్వడం వల్ల కేవలం నీటి పొదుపే కాకుండా, ఇంధన ఆదా కూడా జరుగుతుంది. రోడ్లపై స్కూల్ బస్సులు, వాహనాల రాకపోకలు తగ్గి, ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతాయి. అంతేకాకుండా, అధిక ఉష్ణోగ్రతలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో విద్యార్థులకు అదనంగా ఒక రోజు విశ్రాంతి దొరుకుతుందని, ఇది వారి ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

45
మరో 4 ముఖ్యమైన పండుగలకు గుర్తింపు ఇవ్వాలి

రాష్ట్రంలోని సాంస్కృతిక, మతపరమైన ఆచార వ్యవహారాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఎంఎల్‌సీ విజ్ఞప్తి చేశారు. రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం పండుగలకు జనరల్ హాలిడేస్ ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా మహిళలు ఆచరించే వరలక్ష్మి వ్రతం, సోదరభావాన్ని చాటే రాఖీ పండుగల ప్రాముఖ్యతను వివరించారు. వీటితో పాటు తొలి ఏకాదశి, రథసప్తమి పండుగలను ఐచ్ఛిక సెలవుల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల భావోద్వేగాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

55
సోమవారం సెలవు ఇవ్వాలని కోరిక

పాఠశాలల పనిదినాల ప్రతిపాదనతో పాటు, 2026 ప్రభుత్వ సెలవుల క్యాలెండర్‌లో కొన్ని మార్పులు చేయాలని కోరుతూ ఎంఎల్‌సీ మల్కా కొమరయ్య నవంబర్ 7, 2026న విద్యాశాఖ కార్యదర్శికి మరొక లేఖ రాశారు. నవంబర్ 8 ఆదివారం రోజున దీపావళి పండుగ రావడం వల్ల, ఆ సాధారణ సెలవు వారాంతపు సెలవుతో కలిసిపోయిందని గుర్తుచేశారు. అమావాస్య తిథి సోమవారం వరకు ఉన్నందున, నవంబర్ 9 (సోమవారం) నాడు దీపావళికి జనరల్ హాలిడే ప్రకటించాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో పండుగను ఆనందంగా జరుపుకునే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories