నవంబర్ 24న అంటే రేపు (మంగళవారం) కేవలం కార్తీక పౌర్ణమి మాత్రమే కాదు సిక్కుల గురువు గురునానక్ జయంతి కూడా ఉంది. ఇలా హిందువులకే కాదు సిక్కులకు కూడా ఎంతో పవిత్రమైన రోజు. ఈ రెండు పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది... రేపు ప్రభుత్వ కార్యాలయాలేవి పనిచేయవు.
అధికారిక సెలవే అయినా ప్రైవేట్ కార్యాయలయాలు యదావిధిగా పనిచేసే అవకాశాలున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా హిందువులు, సిక్కులు ఎక్కువగా పనిచేసే కార్యాలయాలకు సెలవు ఉండవచ్చు. కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతికి ఉద్యోగులకు సెలవు ఇవ్వాలా, వద్దా అనేది ఆయా సంస్థల యాజమాన్యాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ఉందా?
తెలంగాణ విద్యాశాఖ కూడా కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. అయితే కొన్ని ప్రైవేట్ స్కూళ్ల సెలవులపై ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ కు సెలవు మెసేజ్ వచ్చివుంటుంది... కాబట్టి స్కూల్ నుండి సమాచారం ఉంటే సెలవు ఉంటుంది. ఎలాంటి సమాచారం లేకుంటే ఆ స్కూల్స్ కి సెలవు లేనట్లే, రేపు (మంగళవారం) యధావిధిగా నడుస్తుంది. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు కూడా రేపు ఎలాంటి సెలవు ఉండదు... యదావిధిగా నడుస్తాయి.