ఓవైపు హెచ్‌సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంటే మరోవైపు తాజాగా ఈ విషయానికి సంబంధించి ఐఏఎస్ అధికారిణి, టూరిజం శాఖ డైరెక్టర్ స్మిత సబర్వాల్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హెచ్‌సీయూ భూములకు, స్మితా సబర్వాల్‌కు సంబంధం ఏంటనే సందేహం రావడం సర్వసాధారణం. ఓ గిబ్లి ఫొటోను షేర్ చేసినందుకే స్మితాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతకీ ఏంటా ఫొటో, అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
HCU Lands
హెచ్‌సీయూ భూముల అభివృద్ధిలో భాగంగా జేసీబీలతో చెట్లను తొలగించడం మొదలవ్వగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అక్కడ ఆవాసం ఉంటున్న నెమళ్లు, జింకలు అరుస్తున్నట్లు ఉన్న కొన్ని వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో కొన్ని ఏఐ జెనరేటెడ్ ఫొటోలు సైతం నెట్టింట ట్రెండ్ అయ్యాయి. వీటిని సామాన్య ప్రజలతో పాటు కొందరు సెలబ్రిటీలు కూడా షేర్ చేశారు.
HCU, Supreme Court, Telangana
ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ మార్చి 31న "హాయ్ హైదరాబాద్" అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టు చేసిన గిబ్లీ ఫొటోను స్మిత రీపోస్ట్ చేశారు. హెచ్‌సీయూలోని ముష్రూమ్ రాక్ ఎదుట పెద్ద సంఖ్యలో జేసీబీలు ఉండగా, వాటిని అడ్డుకుంటున్నట్లు ముందు ముందు నెమలి, జింకలు ఉన్నాయి. ఈ పోస్టుని ఐఏఎస్ స్మితా సబర్వాల్ తన ఎక్స్ ఖాతాలో రీపోస్టు చేశారు. అయితే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ ఫొటో గురించి విచారించారు. పోలీసుల విచారణలో ఆ ఫొటో ఫేక్ అని తేలింది. దీంతో ఆమెకు BNS 179 సెక్షన్ కింద నోటీసులు అందించారు.
ఉన్నత స్థానంలో ఉండి ఇదేం పని?
అయితే స్మితా సబర్వాల్ తీరుపై సోషల్ మీడియాలో కూడా కొంత నెగిటివి మొదలైంది. ఐఏఎస్ లాంటి ఉన్న పదవిలో ఉన్న ఓ వ్యక్తి ఇలా ఫేక్ ఫొటోలను, ప్రజలను తప్పుదారి పట్టించే ఫొటోలను షేర్ చేయడం ఎంత వరకు సబబు? అని అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం తప్పనిపిస్తే ప్రశ్నించాలి కానీ, ఇలా ఫేక్ ఫొటోలను షేర్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఫేక్ ఫొటోలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం
ఇదిలా ఉంటే ఫేక్ ఫొటోల విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఏఐ ఫొటోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు అలాంటి వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే పలువురి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. కొంతమంది బీఆర్ఎస్ నేతలపైనా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులు అందించారు.
ఈ ఫొటో షేర్ చేసినందుకే స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేశారు.