School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?

Published : Dec 10, 2025, 01:38 PM IST

School Holidays : తెలంగాణ విద్యాసంస్థలకు ఈ గురువారం సెలవుండే అవకాశాలున్నాయి. కొన్ని స్కూళ్లకు వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. ఇలా సడన్ గా సెలవులెందుకు ఇస్తున్నారో తెలుసా? 

PREV
15
తెలంగాణలో వరుస సెలవులు

School Holidays : తెలంగాణ విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే కొన్నిచోట్ల సెలవులు ప్రారంభమవగా రేపు (గురువారం, డిసెంబర్ 11న) కూడా కొనసాగనుంది. మొదటివిడత పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రెండ్రోజులు (డిసెంబర్ 10, 11) సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

25
ఈ ప్రాంతాల్లో సెలవు

తెలంగాణలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి... మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమీషన్(EC). ఈ క్రమంలోనే మొదటివిడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో రేపు(గురువారం) ఉదయం నుండి పోలింగ్ జరగనుంది. సర్పంచ్ తో పాటు వార్డు మెంబర్లను ప్రజలు ఎన్నుకోనున్నారు... కాబట్టి పోలింగ్ కోసం ఎక్కువ గదులు అవసరం అవుతాయి. అందుకే ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకుంటున్నారు... కాబట్టి విద్యార్థులకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.

తొలివిడతలో మొత్తం 3836 గ్రామ పంచాయితీలు, 27,960 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ గ్రామాలకు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. రాత్రివరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకోనున్నారు... అందుకోసమే ఇవాళ, రేపు సెలవు ఇచ్చారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా పోలింగ్ విధులకు ఉపయోగించుకోనుంది ఈసి... కాబట్టి పోలింగ్ కేంద్రాలు కలిగిన స్కూళ్లకే కాదు మిగతా విద్యాసంస్థలకు కూడా  రెండ్రోజులు సెలవు ఇచ్చింది ప్రభుత్వం.

35
రెండ్రోజుల సెలవులు మిస్

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 14 జరగనున్నాయి. ఆ రోజు ఆదివారమే కాబట్టి ఎలాగూ స్కూళ్లకి సెలవే. ఎన్నికల ఏర్పాట్లకోసం ముందురోజు కూడా విద్యార్థులకు సెలవు ఇస్తోంది ప్రభుత్వం... కానీ రెండో విడత పోలింగ్ కు ముందురోజు కూడా రెండో శనివారం. ఇలా రెండ్రోజులు సాధారణ సెలవులు వస్తుండటంతో ప్రత్యేకంగా ఎన్నికల కోసం సెలవు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇలా రెండోవిడత పంచాయతీ ఎన్నికలు జరిగే గ్రామాల విద్యార్థులు రెండు సెలవులు మిస్సవుతున్నారు.

45
డిసెంబర్ 16, 17 కూడా సెలవే

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ డిసెంబర్ 17న (బుధవారం) జరగనుంది. కాబట్టి డిసెంబర్ 16,17 రెండ్రోజులు పోలింగ్ జరిగే గ్రామాల్లో విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. మూడో విడత పోలింగ్ ప్రాంతాల్లో సోమవారం ఒక్కరోజే స్కూళ్ళు నడుస్తాయి... శని, ఆది, మంగళ, బుధ నాల్రోజులు సెలవులే.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విద్యాసంస్థలకు నాలుగు రోజుల సెలవులు వస్తున్నాయన్నమాట. శుక్రవారం (డిసెంబర్ 12), సోమవారం (డిసెంబర్ 15) మినహాయిస్తే ఆరురోజులు తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయన్నమాట. ఇలా పంచాయతీ ఎన్నికల సెలవుల గురించి తెలిసి విద్యార్థులు ఎగిరిగంతేస్తున్నారు.

55
తెలంగాణలో క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులు..

ఇలా పంచాయితీ ఎన్నికల సెలవలు ముగియగానే అలా నెలాఖరు వచ్చేస్తుంది... కాబట్టి క్రిస్మస్ సెలవులు ప్రారంభం అవుతాయి. తెలంగాణలోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు డిసెంబర్ 21 నుండి 28 వరకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఇక సాధారణ విద్యాసంస్థలకు మాత్రం కేవలం డిసెంబర్ 25 క్రిస్మస్, డిసెంబర్ 26 భాక్సింగ్ డే సందర్భంగా సెలవులు రానున్నాయి. ఉద్యోగులకయితే డిసెంబర్ 25న క్రిస్మస్ ఈవ్ కు కూడా ఐచ్చిక సెలవు ఇస్తోంది ప్రభుత్వం. 

Read more Photos on
click me!

Recommended Stories