ఆగస్ట్ లో వరుస సెలవులు వస్తున్నాయి… ఈ వీకెండ్ లో రెండో శనివారం, ఆదివారం, సోమవారం (బోనాలు) సందర్భంగా సెలవులు వచ్చాయి. వచ్చే వీకెండ్స్ లో కూడా ఇలాగే వరుస సెలవులున్నాయి.
School Holidays : సెలవులు... ఈ మాట వినిపిస్తే చాలు స్కూల్ విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా ఎగిరిగంతేస్తారు. ఒకటి రెండ్రోజులు సెలవులు వస్తేనే మురిసిపోతుంటారు... శని, ఆదివారంతో ఇంకేదైనా సెలవు కలిసివచ్చి లాంగ్ వీకెండ్ వచ్చిందో వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది ఈ నెల (ఆగస్ట్) లో ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా బాగానే సెలవులు రాబోతున్నాయి. వచ్చేవారం ఎన్నిరోజులు సెలవులున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
24
ఈ వీకెండ్ రెండ్రోజులు సెలవులే
ఈ శనివారం (ఆగస్ట్ 15న) స్వాతంత్య్ర దినోత్సవం... ఈ జాతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఉంది. ఉద్యోగులకు కూడా ఈరోజు అధికారిక సెలవే. అయితే పారసీ న్యూ ఇయర్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడే ఉంది. దీని అవసరం లేకుండానే సెలవు వస్తోంది. ఇది వీకెండ్ సెలవుతో కలిసివస్తోంది... అందుకే రెండ్రోజుల సెలవులున్నాయి.
ఆగస్ట్ 16న ఆదివారం సాధారణ సెలవే. దీనికి స్వాతంత్య్ర దినోత్సవ సెలవు కలిసిరావడంతో ఈ వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఈ రెండ్రోజులు మూతపడనున్నాయి. అంటే తెలుగు విద్యార్థులు, ఉద్యోగులకు ఈ రెండ్రోజులు పండగే అన్నమాట.
34
ఆగస్ట్ 21న సెలవే... ఎందుకో తెలుసా?
ఆషాడ మాసం ముగిసి శ్రావణ మాసం వస్తోంది... ఈ నెలను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా పెళ్లయిన మహిళలు కుటుంబం, భర్త బాగుండాలని ఈ నెలలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు. ఉద్యోగాలు చేసే తెలుగు మహిళలు కూడా ఈ వ్రతం జరుపుకుంటారు... వీరికోసమే ఆగస్ట్ 21న (శుక్రవారం) వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఐచ్చిక సెలవు ప్రకటించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకుంటే ముందస్తుగా అనుమతి తీసుకుని వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు... కానీ ఇది అధికారిక సెలవు కాదు.
వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్ట్ 21న సెలవు తీసుకుంటే వరుసగా మూడ్రోజుల సెలవులు కలిసిరానున్నాయి. ఇక ఆగస్ట్ 22న శనివారం, ఆగస్ట్ 23న ఆదివారం... చాలామంది ఉద్యోగులకు వీకెండ్ లో రెండ్రోజులు సెలవు ఉంటుంది. ఇలా కొందరు ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులే... వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్. శనివారం సెలవు లేనివారికి రెండ్రోజుల సెలవు ఖాయం.
వచ్చే పదకొండు రోజుల్లో నాలుగు సెలవులున్నాయి... అవి వీకెండ్ కలిసి వస్తున్నాయి. ఇంకేముంది ఈ సెలవులను ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి... ఈ వీకెండ్స్ లో జీవితంలో మరిచిపోలేని అనుభూతులను మిగుల్చుకొండి.