జోగులాంబ ఆలయం నుండే రెండో ఫేజ్ :మే 9 నుండి రేవంత్ పాదయాత్ర

First Published | Apr 18, 2023, 4:43 PM IST

ఈ  ఏడాది  మే  9వ తేదీ నుండి  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  రెండో విడత  పాదయాత్రను  ప్రారంభించనున్నారు. 

రేవంత్ రెడ్డి

ఈ ఏడాది మే  9వ తేదీ  నుండి  రెండో విడత  పాదయాత్ర ప్రారంభించనున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..జోగులాంబ  ఆలయం నుండి  పాదయాత్రను ప్రారంభించనున్నారు.

రేవంత్ రెడ్డి

ఈ  ఏడాది ఫిబ్రవరి  ఆరో  తేదీన   ములుగు  నియోజకవర్గంలోని మేడారం  ఆలయంలో  ప్రత్యేక  పూజలు నిర్వహించి  రేవంత్ రెడ్డి  పాదయాత్రను  ప్రారంభించారు


రేవంత్ రెడ్డి

 ఈ ఏడాది మార్చి  చివరి వారంలో  రేవంత్ రెడ్డి తన పాదయాత్రకు బ్రేక్  ఇచ్చారు. నిరుద్యోగ దీక్షలు,  సిట్ నోటీసుల నేపథ్యంలో   ఐదు రోజుల  పాటు  యాత్రకు బ్రేక్  ఇచ్చారు. 

రేవంత్ రెడ్డి

సుమారు  45  రోజులకు పైగా రేవంత్ రెడ్డి  పాదయాత్ర  నిర్వహించారు.    టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  అంశానికి  సంబంధించి   రేవంత్ రెడ్డి  చేసిన  ఆరోపణల నేపథ్యంలో   విచారణకు  రావాలని రేవంత్ రెడ్డికి  సిట్  నోటీసులు  జారీ చేసింది.ఈ నోటీసుల  నేపథ్యంలో  ఈ నెల  23న  రేవంత్ రెడ్డి  సిట్ విచారణకు హాజరయ్యారు.   సిట్ విచారణ కు హాజరైన తర్వాత    రేవంత్ రెడ్డి   మాత్రం  పాదయాత్ర  కొనసాగించలేదు

రేవంత్ రెడ్డి

ఈ నెలలో  పాదయాత్రను  తిరిగి ప్రారంభించాలని  భావించారు.  కానీ   పార్టీ కార్యక్రమాలతో  రెండో విడత  పాదయాత్రను  రేవంత్ రెడ్డి  ప్రారంభించలేదు.  మే 9వ తేదీ నుండి  పాదయాత్రను  ప్రారంభించాలని  రేవంత్ రెడ్డి  నిర్ణయం తీసుకున్నారు. 

రేవంత్ రెడ్డి

సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క  పాదయాత్ర  ఉమ్మడి  ఆదిలాబాద్  జిల్లాలో  ప్రారంభమైంది.  ఈ పాదయాత్ర  ఆదిలాబాద్  జిల్లా నుండి ఖమ్మం వైపునకు సాగుతుంది.    గతంలో  తాను  పర్యటించని  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  రేవంంత్ రెడ్డి  పాదయాత్ర  సాగనుంది. హత్  సే మత్  జోడో  అభియాన్ కార్యక్రమంలో భాగంగా  కాంగ్రెస్ నేతు  పాదయాత్రలు  నిర్వహిస్తున్నారు.

Latest Videos

click me!