చివరి అంకానికి టీపీసీసీ చీఫ్ రేస్: ఆ ఇద్దరి మధ్యే పోటీ, సీనియర్ల అసహనం

First Published Dec 25, 2020, 11:56 AM IST

టీపీసీసీ చీఫ్ పదవికి నేతల మధ్య పోటీ ప్రధానంగా నెలకొంది. పార్టీ అధిష్టానం  ఇద్దరి పేర్లను తీవ్రంగా పరిశీలిస్తోొంది. పార్టీ అధిష్టాానంపై కొందరు సీనియర్లు అసహనంతో ఉన్నారు. 

టీపీసీసీ చీఫ్ పదవి కోసం మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య పోటీ నెలకొందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేసులో ఉన్న ఇతర నేతలకు పార్టీలో మరిన్ని కీలక పదవులు ఇచ్చే అవకాశం ఉంది.
undefined
ఈ నెలాఖరుకు టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను పార్టీ నాయకత్వం ప్రకటించే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేతను ఎంపిక చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
undefined
టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఇప్పటికే 165 మంది నుండి అభిప్రాయాలను సేకరించారు.
undefined
ఐదుగురు నేతల పేర్లను షార్ట్ లిస్ట్ చేసి పార్టీ చీఫ్ సోనియాగాంధీకి మాణికం ఠాగూర్ అందించారు. రాష్ట్రంలో పార్టీ చీఫ్ గా ఎవరికి అవకాశం కల్పిస్తే ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని కూడ ఠాగూర్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి తన అభిప్రాయాన్ని చెప్పారు.
undefined
టీపీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలని మెజారిటీ నేతలు కోరినట్టుగా పార్టీలో ప్రచారం సాగుతోంది.
undefined
రేవంత్ రెడ్డికి కాకుండా పార్టీ కోసం మొదటి నుండి పనిచేసిన వారికే టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయించాలని పార్టీ సీనియర్లు కొందరు మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ల జాబితాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు టీపీసీసీ చీఫ్ పదవిని కేటాయించాలని కాంగ్రెస్ సీనియర్లు కోరుతున్నారు.
undefined
టీపీసీసీ చీఫ్ పదవి జాబితాలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కల మధ్య ప్రధానమైన పోటీ నెలకొందని సమాచారం.
undefined
టీపీసీసీ చీఫ్ పదవికి పోటీ పడి ఆ పదవి దక్కని నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటాయించే అవకాశం ఉందని సమాచారం.
undefined
సీడబ్ల్యుసీ ఆహ్వానితుడిగా మరికొందరు నేతలకు పార్టీ నాయకత్వం అవకాశం కల్పించాలని భావిస్తోంది.
undefined
పార్టీ చీఫ్ సోనియాకు అందించిన జాబితాలో తన పేరు లేకపోవడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం తన కష్టాన్ని పార్టీ నాయకత్వం గుర్తించలేదన్నారు.
undefined
రేవంత్ వైపునకు పార్టీ నాయకత్వం కొంత మొగ్గు చూపినట్టుగా ప్రచారం సాగడం కాంగ్రెస్ సీనియర్లలో అసహనానికి కారణమైంది. కొందరు సీనియర్లు పార్టీ నాయకత్వం తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ చీలిపోకుండా ఉండేలా పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
undefined
click me!