వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి.