ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్రమట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకే వ్యాపించి ఉంది. వాతావరణశాఖ ప్రకారం ఈ ఆవర్తనం 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గంటకు 30–40కి.మీ వేగంతో ఈదురుగాలుతో కూడిన వర్షాలు కురిశాయి.