ప్రియాంక సభపై ఫోకస్: యూత్ డిక్లరేషన్ ప్రకటించినున్న కాంగ్రెస్

First Published | May 5, 2023, 7:41 PM IST

ఈ నెల  8న సరూర్ నగర్ స్టేడియంలో  జరిగే  యువ సంఘర్షణ సభపై  కాంగ్రెస్ పార్టీ  కేంద్రీకరించింది.   ఈ సభను విజయవంతం చేసేందుకు  ఆ పార్టీ నాయకులు  సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 
 

ప్రియాంక సభపై ఫోకస్

ఈ నెల 8వ తేదీన   సరూర్ నగర్ స్టేడియంలో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  భారీ సభను  ఏర్పాటు  చేయనున్నారు. ఈ సభకు  యువ సంఘర్షణ పభగా  నామకరణం చేశారు.   ఈ సభలో  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. 

ప్రియాంక సభపై ఫోకస్


 ఈ సభలో  యూత్ డిక్లరేషన్ ను  కాంగ్రెస్ ప్రకటించనుంది. గతంలో  రాహుల్ గాంధీ వరంగల్  సభలో  రైతు డిక్లరేషన్ ను ప్రకటించింది.    తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే  ఏం చేయనున్నామో  యూత్ డిక్లరేషన్ పేరుతో  కాంగ్రెస్ ప్రకటించనుంది.  


ప్రియాంక సభపై ఫోకస్


ప్రియాంకగాంధీ  కర్ణాటక  రాష్ట్రంలో  ఎన్నికల ప్రచారంలో  బిజీగా  ఉన్నారు. కర్ణాటక  ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఆమె  తెలంగాణకు రానున్నారు.  సరూర్ నగర్ స్టేడియంలో  జరిగే  సభలో  పాల్గొన్న తర్వాత ఆమె  న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. 

ప్రియాంక సభపై ఫోకస్

ఈ నెల  8న జరిగే  యువ సంఘర్షణ సభను జయప్రదం  చేయాలని ఆ పార్టీ పట్టుదలగా  ఉంది.   పార్టీ సీనియర్లు  జన సమీకరణపై  కేంద్రీకరించారు. ఇాళ  మధ్యాహ్నం  హైద్రాబాద్ గాంధీ భవన్ లో  పార్టీ సీనియర్లతో  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే సమావేశమయ్యారు.ప్రియాంక గాంధీ సభపై  చర్చించారు.  సరూర్ స్టేడియాన్ని   మాణిక్ రావు  ఠాక్రే, రేవంత్ రెడ్డిలు  ఇవాళ సాయంత్రం పరిశీలించారు.  సరూర్ నగర్ స్టేడియానికి  శ్రీకాంత్ చారి  పేరు పెట్టారు. 

ప్రియాంక సభపై ఫోకస్

రైతు  డిక్లరేషన్ తరహలోనే  యూత్ డిక్లరేషన్ ను కూడా  తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా  ప్రచారం చేయాలని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ప్లాన్  చేస్తుంది.    కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వస్తే  ఏం చేయనుందో  రానున్న రోజుల్లొ మరిన్ని డిక్లరేషన్లను  ఇవ్వనుంది  కాంగ్రెస్ పార్టీ. 
 

ప్రియాంక సభపై ఫోకస్

ఈ ఏడాది  చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ెన్నికలు జరగనున్నాయి. తెలంగానలో  అధికారంలోకి రావాలని  కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా  ఉంది.  పార్టీలోని సీనియర్లు కూడా తమ  మధ్య  గ్యాప్ లేదని  క్యాడర్ కు చెప్పే ప్రయత్నం చేశారు. నల్గొండలో  జరిగిన  నిరుద్యోగ సభలో  రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు  ఒకే వేదికను పంచుకున్నారు. 
 

Latest Videos

click me!