పవన్ కల్యాణ్ పై ప్రధాని మోదీ ఆప్యాయత... ఉప్పొంగిపోతున్న జనసైనికులు, మెగా ఫ్యాన్స్

Published : Nov 08, 2023, 07:59 AM ISTUpdated : Nov 08, 2023, 08:07 AM IST

తెలంగాణ బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో ఆప్యాయంగా మాట్లాడుతూ కనిపించడం ఆ పార్టీ శ్రేణులను, మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. 

PREV
17
పవన్ కల్యాణ్ పై ప్రధాని మోదీ ఆప్యాయత... ఉప్పొంగిపోతున్న జనసైనికులు, మెగా ఫ్యాన్స్
Modi Pawan

హైదరాబాద్ : ఎలక్షన్స్ సమయం కావడంతో తెలంగాణ రాజకీయాలు ఇప్పటికే హాట్ హాట్ గా వున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ ఎంట్రీ పవర్ పాలిటిక్స్ ను మరింత రసవత్తరంగా మార్చింది. ఇప్పటికే బిజెపితో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు జనసేనాని సిద్దమయ్యారు. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగి జనసేన అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఇలా తెలంగాణలో బిజెపి, జనసేన కలిసి పోటీ చేయడమే కాదు కలిసే ప్రచారం చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ సభతో బిజెపి, జనసేన ఉమ్మడి ప్రచారం ప్రారంభమయ్యింది. 
 

27
Modi Pawan

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బిజెపి నిర్వహించిన 'బిసి ఆత్మగౌరవ సభ' కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. తెలంగాణ బిజెపి నాయకుల ఆహ్వానం మేరకు పవన్ కల్యాణ్ కూడా ఈ సభకు హాజరయ్యారు. కేవలం బిజెపి మాత్రమే కాదు జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలివచ్చారు.  
 

37
pawan kalyan

ప్రధాని మోదీ సభాస్థలికి రాకముందే పవన్ చేరుకున్నారు. ఆయన రాకతో ఒక్కసారిగా ఎల్బీ స్టేడియంలో సందడి మొదలయ్యింది. జనసేన శ్రేణులే కాదు బిజెపి వాళ్లుసైతం పవన్ ఎంట్రీతో ఒక్కసారిగా కరతాళ ధ్వనులు చేయడంతో కోలాహలం ఏర్పడింది. తెలంగాణ బిజెపి నాయకులు పవన్ కల్యాణ్ కు సాదర స్వాగతం పలికారు. పవన్ పక్కనే కూర్చున్న బిజెపి ఎంపి బండి సంజయ్ ఆయనతో మాట్లాడుతూ కనిపించారు. 

47
Modi Pawan

అయితే ప్రధాని నరేంద్ర మోదీ వేదికపైకి వచ్చినతర్వాత జనసైనికులు ఉప్పొంగిపోయే దృశ్యాలు దర్శనమిచ్చారు. రాగానే పవన్ కల్యాణ్ ను ఆప్యాయంగా పలకరించి ప్రధాని భుజం తట్టారు. పక్కనే కూర్చున్న పవన్ తో మద్యమద్యలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కనిపించారు. 

57
Pawan Modi

ప్రధాని మోదీ పక్కనేవున్న పవన్ ను పిలిచి ఏదో అడిగాడు. అందుకు పవన్ కూడా సమాధానం చెబుతున్నారు. కొద్దిసేపు ఇలా ప్రధాని, పవన్ మధ్య ఏదో ఆసక్తికర సంభాషనే సాగినట్లుంది. అలాగే పవన్ ప్రసంగించే సమయంలో సభకు వచ్చినవారి స్పందనను ప్రధాని గమనించారు. 
 

67
Modi Pawan

ఇక చివరగా ప్రధాని వెళ్లిపోయే సమయంలో బిజెపి నాయకులందరూ నమస్కరిస్తూ వీడ్కోలు పలికారు. అలాగే పవన్ కూడా నమస్కరించారు. కానీ మోదీ పవన్ వద్దకు వెళ్లి చేతిలో చేయివేసాడు. ఈ సమయంలోనూ ప్రధానితో పవన్  ఏదో చెప్పాడు. 

77
Modi Pawan

ఇలా తెలంగాణ బిజెపి సభలో తమ అభిమాన నటుడు, నాయకుడికి దక్కిన గౌరవం, ప్రేమను చూసి జనసైనికులు, మెగా అభిమానులు ఉప్పొంగి పోతున్నారు. తనకు ప్రధానితో మంచి సాన్నిహిత్యం వుందని పవన్ చెప్తుంటే విన్నవాళ్లు ఈ వేదికపైన కళ్లారా చూసారు. పవన్ ను కాస్త ప్రత్యేకంగా చూస్తూ ప్రధాని ఆప్యాయత కనబర్చడం జనసైనికులను ఆనందంలో ముంచెత్తింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories