ఈ వీకెండ్ హైదరబాదీలకు కష్టాలు తప్పవు... బయటకు వెళ్లారో బుక్ అయినట్లే..!

Published : Feb 06, 2026, 03:11 PM ISTUpdated : Feb 06, 2026, 04:06 PM IST

ఫిబ్రవరి 7న అంటే రేపు ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు సమ్మెక పిలుపునిచ్చారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈ స్ట్రైక్ జరుగుతుంది కాబట్టి హైదరాబాదీలకు ప్రయాణ కష్టాలు తప్పవు.  

PREV
15
ఓలా, ఉబర్, ర్యాపిడో రైడర్స్ సమ్మె...

ఫిబ్రవరి 7న  (శనివారం) ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు నిరసన చేపట్టనున్నాారు. తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని కార్మిక సంఘాలు ఇప్పటికే దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెతో యాప్ ఆధారిత ప్రయాణ సేవలకు అంతరాయం కలగనుంది. డ్రైవర్లంతా దాదాపు 6 గంటలు ఆఫ్‌లైన్‌లో ఉండనున్నారు. అంటే ఓలా, ఉబర్, రాపిడో యాప్స్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. 

25
కార్మికులు సమ్మె

కనీస ధరల నోటిఫికేషన్ కోసం దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత రవాణా కార్మికులు సమ్మెలకు దిగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కార్మికులు కూడా ఇలాంటి నిరసనలు చేశారు. 

35
డ్రైవర్లు ఎందుకు నిరసన తెలుపుతున్నారు?

మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్ లైన్స్ 2025 ప్రకారం కాకుండా యాప్స్ ఇష్టానుసారంగా ఛార్జీలు నిర్ణయిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఛార్జీల విషయంలో గైడ్ లైన్స్ ఫాలో అయ్యేలా చూడాలని కోరుతున్నారు. అందుకే ఈ సమ్మె ద్వారా డ్రైవర్లు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని చూస్తున్నారు.

45
డ్రైవర్ల డిమాండ్లు ఏమిటి?
  • యూనియన్లతో చర్చించాకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస ధరలు నిర్ణయించాలి.
  • వాణిజ్య కార్యకలాపాలకు ప్రైవేట్ వాహనాల వాడకాన్ని ఆపాలి.
  • యాప్‌ల ధరల పెరుగుదల ఆదాయంపై ప్రభావం చూపుతోంది.
  • ఇంధనం, నిర్వహణ ఖర్చుల పెరుగుదలను నియంత్రించాలి.
  • కార్మికుల భద్రత, న్యాయమైన ఆదాయం దక్కేలా చూడాలి.
55
భారతదేశంలో గిగ్ ఎకానమీ

2025-26 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో గిగ్ ఎకానమీ వేగంగా పెరుగుతోంది… కానీ ఆదాయం అస్థిరంగా ఉంది. 2021లో గిగ్ వర్కర్ల సంఖ్య 7.7 మిలియన్లుగా ఉంది. ఇందులో 40% మంది గిగ్ వర్కర్లు నెలకు కేవలం ₹15,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. వీరి ఆదాయాన్ని కంపెనీలు దోచుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories