హైదరాబాదీలపై కొత్త వైరస్ అటాక్ ... రోజుకు వందల కేసులు.. ఏమిటీ వైరస్? ఎలా గుర్తించాలి?

First Published | Jul 26, 2024, 10:01 AM IST

హైదరాబాద్ ప్రజలారా జాగ్రత్త.... నగరంపై కొత్త వైరస్ అటాక్ చేసింది. కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా వుంటే మంచిది. అసలు ఏమిటీ వైరస్? లక్షాణాలేమిటి? ఎలా వ్యాప్తి చెందుతుంది? 

Norovirus

వర్షాకాలం రాగానే సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. వాతావరణ మార్పులు,  నీరు, ఆహారం కలుషితమవడం కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్ లు శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇక దోమల కారణంగా డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా వర్షాకాలంలో చాలా ఈజీ వ్యాపిస్తాయి.ఈ వ్యాధులు చాలవన్నట్లు ఇప్పుడు కొత్త వ్యాధి తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో వేగంగా వ్యాపిస్తోంది. 
 

Norovirus

నోరో వైరస్ : 
 
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మరీముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలో చాలామంది వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. డబీర్ పురా, యాకుత్ పురా, పురానా హవేలీ, మొగల్ పురా, మలక్ పేట్ వంటి ప్రాంతాల ప్రజలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతున్నాయి. ఈ వాంతులు, విరేచనాలకు కారణం నోరో వైరస్ గా గుర్తించారు. 
 


Norovirus


హైదరాబాద్ లో రోజుకు వందకంటే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. నోరో వైరస్ తో బాధపడుతూ వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, క్లినిక్స్ బాట పడుతున్నారు. కొందరి పరిస్థితి సీరియస్ గా మారి ఐసియూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఇలా నోరోవైరస్ హైదరబాదీలను భయకంపితులను చేస్తోంది. 
 

Norovirus

నోరో వైరస్ లక్షణాలు :

1.  తరచూ వాంతులు కావడం 

2. డిహైడ్రేషన్ (నోరు తడారిపోవడం, ఎక్కువగా దాహం కావడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం లేదా యూరిన్ రంగుమారడం)

3. విపరీతమైన  కడుపునొప్పి 

4. విపరీతమైన చలిజ్వరం

5. ఒళ్లునొప్పులు

6.  విపరీతమైన తలనొప్పి 

Norovirus

ఈ లక్షణాలతో బాధపడేవారు ఆలస్యం చేయకుండా వైద్యం తీసుకోవాలి. లేదంటే పరిస్థితి ప్రాణాతకంగా మారే ప్రమాదం వుంది. హైదరాబాద్ లో చాలామంది ఈ లక్షణాలతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. 

Norovirus

వైరస్ వ్యాప్తికి కారణాలు : 

కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నోరో వైరస్ బారిన పడుతున్నారు. కలుషిత వాతావరణం కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. ఇది అంటువ్యాధి... కాబట్టి ఒకరినుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకినవారితో సన్నిహితంగా వుండేవారు సులభంగా ఈ వైరస్ బారిన పడతారు. 

Norovirus

హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో నోరో వైరస్ వ్యాప్తికి కలుషిత నీరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. బయట దొరికే కలుషిత ఆహారం, నీరు తాగడంవల్ల ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇలా గత రెండుమూడు వారాలుగా ప్రతిరోజు 100 నుండి 120 కేసులు బయటపడుతున్నాయి. ఈ వైరస్ బారినపడ్డ వారితో పాతబస్తీ, ఆ పరిసరాల్లోని హాస్పిటల్స్, క్లినిక్స్ నిండిపోతున్నాయి. 

Norovirus

ఇక నోరో వైరస్ సోకినవారు డీహైడ్రేషన్ కు గురవుతున్నారు.దీంతో కొందరికి కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని చాలా వ్యవస్థలపై ఈ వైరస్ ప్రభావం చూపుతుండటంతో కొందరు మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ కు గురవుతున్నారు. ఇలాంటివారు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. 

Norovirus

జాగ్రత్తలు

నోరో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది... కాబట్టి హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా వుండటం చాలా అవసరం. ఇది అంటువ్యాధి కాబట్టి  స్కూళ్లు, ఆఫీసుల, జనాలు ఎక్కువగా వుండే ప్రాంతాల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా స్కూళ్లలో చిన్నారులను భౌతికదూరం పాటించేలా చూడాలి.  
 

Norovirus

ఈ వైరస్ సోకిన వ్యక్తికి 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కాబట్టి లక్షణాలు బయటపడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. సమయానికి వైద్యం అందితే రెండుమూడు రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడుతుంది.  
 

Norovirus

కలుషిత నీరు, ఆహారం కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణం.కాబట్టి బయటి ఫుడ్ కు దూరంగా వుండటమే మంచింది. ఇంట్లో కూడా శుభ్రత పాటించారు. తాగునీరు ఏమాత్రం అపరిశుభ్రంగా అనిపించినా కాచి చల్లార్చి తాగండి. సీనియర్ సిటిజన్స్, చిన్నారులపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా వుంటుంది.. కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో ముందుజాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. 

Norovirus

నోరో వైరస్ చాలా సాధారమైనది... ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సుమారు 685 మిలియన్స్ కేసులు నమోదవుతున్నాయట. అజాగ్రత్త వహిస్తే మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయి ఆరోగ్య శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వైరస్ బారినపడ్డాక వైద్యం తీసుకునే బదులు ఈ వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. 

Latest Videos

click me!