నాగార్జునసాగర్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావోరేవో, వ్యూహాత్మక అడుగులు

First Published Jan 15, 2021, 11:18 AM IST

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.ఈ ఎన్నికల్లో  తమ సత్తాను చాటాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నిక ప్రధానమైన మూడు రాజకీయ పార్టీలకు కీలకం. ఈ ఎన్నికల్లో తమ సత్తాను చూపాలని ఆ పార్టీలు బావిస్తున్నాయి. ఈ ఎన్నికల కోసం మూడు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
undefined
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మరణించారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.
undefined
ఈ స్థానం నుండి మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపనుంది.చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానాల నుండి (నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ స్థానం నాగార్జునసాగర్ గా మారింది) ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఈ స్థానం నుండి జానారెడ్డి ఓటమి పాలయ్యారు.
undefined
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1994లో చలకుర్తి నుండి పోటీ చేసిన జానారెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ నుండి 2018లో పోటీ చేసిన జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. ఈ రెండు దఫాలు కూడ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతల చేతిలోనే ఆయన ఓటమి పాలయ్యాడు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి 2018 లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్యకు 46.3 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి 42 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్ధి కె.నివేదిత రెడ్డికి 1.4 శాతం ఓట్లు దక్కాయి.
undefined
2014 ఎన్నికల్లో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి జానారెడ్డికి 42.7 శాతం ఓట్లు దక్కాయి.టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహ్మయ్యకు 32.6 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్ధి కె. అంజయ్య యాదవ్ 17 శాతం ఓట్లు దక్కించుకొన్నాడు.
undefined
ఈ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేసింది. సీపీఎంకు రాజీనామా చేసిన టీఆర్ఎస్ లో చేరిన నోముల నర్సింహ్మయ్య 2014 ఎన్నికల్లో పోటీ చేశారు.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై టీఆర్ఎస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. నోముల నర్సింహ్మయ్య కుటుంబానికి సీటు ఇవ్వాలని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
undefined
నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్ లేదా ఆయన భార్య లక్ష్మీకి సీటు ఇవ్వాలని కేసీఆర్ ను కోరుతున్నారు. ఇదే స్థానం నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి, తేర చిన్నపరెడ్డి, ఎంసీకోటిరెడ్డి ల పేర్లను కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.
undefined
జానారెడ్డికి పోటీగా సుఖేందర్ రెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయాన్ని టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే పోటీ విషయంలో తనను ఎవరూ కూడా సంప్రదించలేదని సుఖేందర్ రెడ్డి ఇటీవలనే ప్రకటించారు.
undefined
యాదవ సామాజిక వర్గానికే సీటు ఇవ్వాల్సి వస్తే ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేరును కూడ టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని తెలుస్తోంది.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ గెలుపొందింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ ఆశించిన ఫలితాలు దక్కించుకోలేదు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన ఫలితాలను సాధించింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల్సిన అనివార్య పరిస్థితి టీఆర్ఎస్ కు నెలకొంది.
undefined
కాంగ్రెస్ పార్టీకి కూడ ఈ స్థానంలో విజయం సాధించడం అనివార్య పరిస్థితి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేదు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపొందాల్సిన అనివార్య పరిస్థితి కాంగ్రెస్ కు నెలకొంది.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తే పార్టీ క్యాడర్ లో ఉత్సాహం వస్తోంది. బీజేపీ దూకుడుకు ఈ విజయం ద్వారా చెక్ పెట్టవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఈ స్థానంలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని శక్తులను కూడగట్టుకొంటుంది.
undefined
నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ ప్రచారం చేసుకొంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కూడ బీజేపీ కేంద్రీకరించింది.
undefined
ఈ స్థానం నుండి పోటీకి కె. అంజయ్య యాదవ్, కె. నివేదిత రెడ్డిలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో ఇదే స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా అంజయ్య యాదవ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల సమయంలో 27 వేల ఓట్లు అంజయ్య యాదవ్ కు వచ్చాయి. గత ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన నివేదిత రెడ్డికి 1.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
undefined
ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. యాదవులతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కూడ ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
undefined
click me!