తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో గాలివాన బీభత్సం
రుతుపవనాల ఎఫెక్ట్‌తో పాటు దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి అంతర్గత కర్ణాటక వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోయింది. రాబోయే 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పశ్చిమ, దక్షిణ జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
ఈ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇవే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ సహా మొత్తం 33 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లోనే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో హయ్యస్ట్‌గా 5.08 సెం.మీ వర్షం కురిసింది.