Rain Alert : ఇక ఎండాకాలం ముగిసినట్లే... తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు

Published : May 24, 2025, 08:04 AM ISTUpdated : May 24, 2025, 08:08 AM IST

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక ఈ నెలంతా ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది… అంటే ఇక ఎండాకాలం ముగిసినట్లే.

PREV
15
ఇక వర్షాకాలం మొదలైనట్లే

Andhra Pradesh and Telangana Weather : రోహిణి కార్తె వేళ రోళ్లు పగిలే స్థాయిలో ఎండలుంటాయంటారు.. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి, వెదర్ అప్డేట్స్ చూస్తుంటే ఇక ఈసారి ఎండాకాలం ముగిసినట్లే... ఇకపై వానలు కొనసాగనున్నాయి కాబట్టి వర్షాకాలం మొదలైనట్లే. ఇక ఈ నెలంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

25
నైరుతి రుతుపవనాలు ఎర్లీ ఎంట్రీ

ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశంలోకి ఎంటర్ అవుతున్నాయి. మరో రెండ్రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్నితాకి దేశమంతా విస్తరించనున్నాయి. జూన్ మొదటివారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించనున్నాయి. అయితే అంతకు ముందే బంగాళాఖాతంలో అల్పపీడనం, అరేబియా సముద్రంలో వాయుగుండం కారణంగా వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

35
తుపాను ముప్పు

అయితే అరేబియా సముద్రంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారిందని... ఇది తుఫానుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఈ నాలుగైదు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది. ఈ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా ఉంటుందని... వర్షాలు దంచికొడతాయని హెచ్చరించారు.

45
తెలంగాణలో వర్షాలే వర్షాలు

తెలంగాణలో ఈనెల 27 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నేడు(శనివారం) హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ తో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న(శుక్రవారం) ఉదయం వరకు మహబూబ్ నగర్ జిల్లా నర్నూల్ లో అత్యధికంగా 12.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

55
ఆంధ్ర ప్రదేశ్ వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే అల్లూరి, మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ , ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుండి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories