తెలంగాణ దశ దిశను మార్చిన ప్రియతమ నేత.. ట్విటర్లో కేసీఆర్ ఫొటోలు షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత...

Published : Apr 25, 2022, 12:26 PM IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలు కొన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఒక్కడిగా మొదలై ప్రియతమ నేతగా ఎదిగిన క్రమంలో కొన్ని చిత్రాలు అంటూ ట్వీట్ చేశారు. 

PREV
14
తెలంగాణ దశ దిశను మార్చిన ప్రియతమ నేత.. ట్విటర్లో కేసీఆర్ ఫొటోలు షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత...
MLC Kavitha shared KCR photos on Twitter

ఒక్కడిగా మొదలై, యావత్తు తెలంగాణను కదిలించి, తెలంగాణ దశ దిశను మార్చిన మన ప్రియతమ నేత కేసీఆర్ గారి ప్రయాణంలో కొన్ని చిత్రాలు...అంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. 

24
MLC Kavitha shared KCR photos on Twitter

ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా... ఉద్యమసమయంలో.. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు.. బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడడం లాంటి ఫొటోలు కవిత షేర్ చేశారు. 

34
MLC Kavitha shared KCR photos on Twitter

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దడుతా.. ఇవి తెలంగాణ సాధనలో కేసీఆర్ ను హీరోగా చేసిన మాటలు. దశాబ్దాల కల సాకారానికి ఊపిరిలూదిన మాటలు. తెలంగాణ జాతి పితగా కేసీఆర్ అవతరించడానికి మార్గనిర్దేశనంగా నిలిచిన మాటలు.

44
MLC Kavitha shared KCR photos on Twitter

ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల సొంతరాష్ట్ర కలను నిజం చేయడానికి, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పడడం నుండి రాష్ట్రావతరణ వరకూ దశాబ్దంన్నరపాటు సాగిన మలిదశ ఉద్యమం ఓ పెద్ద చరిత్రే. ఆ ఉద్యమానికి సంబంధించిన కొన్ని జ్ఠాపకాలు ఇలా పంచుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories