కొత్త సెక్రటేరియట్‌‌కి కేసీఆర్.. నిర్మాణ పనులపై సంతృప్తి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి అభినందనలు

Siva Kodati |  
Published : Apr 19, 2022, 09:05 PM IST

కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్‌ పనులను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల తీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అభినందిస్తూ.. పలు సూచనలు చేశారు. 

PREV
17
కొత్త సెక్రటేరియట్‌‌కి కేసీఆర్.. నిర్మాణ పనులపై సంతృప్తి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి అభినందనలు
kcr

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అద్భుతంగా తీర్చిదిద్దాలని అధికారుల‌ను ఆదేశించారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ, త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం సూచించారు. 

27
kcr

మంగళవారం కేసీఆర్ నూతన సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి, పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. తొలుత బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ సరళిని పరిశీలించిన సీఎం కేసీఆర్, పలు అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

37
kcr

పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లు, వాటి నాణ్యతను ముఖ్యమంత్రి పరిశీలించారు. మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వీటిలోకి వెంటిలేషన్ బాగానే వస్తోందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. లిఫ్టులు, వాటి సంఖ్య, కెపాసిటీపై కేసీఆర్ ఆరా తీశారు. 

47
kcr

రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ వాల్ నిర్మాణాన్ని పరిశీలించి, స్టోన్ సప్లయ్ గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోన్ నిర్మాణంలో ప్రత్యేక డిజైన్లు అందంగా ఉండేలా తీర్చిదిద్దాలని కేసీఆర్ సూచించారు. పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించిన ఆయన.. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్ పరిశీలించి, అందంగా ఉండేలా చూడాలన్నారు.

57
kcr

సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ భవన పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులను సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్స్ పనులను కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

67
kcr

బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సెక్రటేరియట్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై మంత్రిని, అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.

77
kcr

సీఎం కేసీఆర్ వెంట ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే జోగు రామన్న, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సీఎంవో అధికారులు స్మితా సభర్వాల్, శేషాద్రి, రాహుల్ బొజ్జా, ప్రియాంక వర్గీస్, ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, నిర్మాణ సంస్థ షాపూర్ జీ పల్లోంజీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

click me!

Recommended Stories