స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్థులో నర్సింగ్ కాలేజీ విద్యార్ధినుల కొరకు తాత్కాలికంగా వసతి గృహన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం స్థానిక RDO రాజాగౌడ్ గారిని తీసుకుని అకస్మాత్తుగా వసతిగృహాన్నిస్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనిఖీ చేశారు. వసతి గృహంలో తిరుగుతూ సౌకర్యాలను గురించి విద్యార్ధినులను అడిగి తెలుసుకున్నారు.
24
Pocharam Srinivasa Reddy
సదుపాయాలు బాగున్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవని విద్యార్ధినులు తెలపడంతో స్పీకర్ పోచారం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ...‘శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణానికి రూ. 40 కోట్లు మంజూరయ్యాయి. ఈ నెలలోనే పనులను ప్రారంభిస్తాం. అన్ని వసతులతో నూతన భవనాన్ని త్వరితంగా నిర్మించి వచ్చే ఏడాదికి అందుబాటులోకి తీసుకువస్తాం’.. అని చెప్పారు.
34
Pocharam Srinivasa Reddy 2
ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, తగిన సౌకర్యాలు కల్పిస్తూ అందుబాటులో ఉండాలని తన PA భగవాన్ రెడ్డి ని స్పీకర్ ఆదేశించారు.అనంతరం విద్యార్ధినులతో కలిసి అల్పాహారం చేశారు.
44
Pocharam Srinivasa Reddy 1
టిఫిన్ చేసిన తరువాత ఆహారం బాగుందని ఇదే నాణ్యతను కొనసాగించాలని సూచించారు.స్వంత కుటుంబ సభ్యుల వలే తమ బాగోగులు చూసుకుంటున్న స్పీకర్ గారికి నర్సింగ్ విద్యార్ధినులు ఈసందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.