రఘురామకు ముగ్గురు వైద్యుల పరీక్షలు: జ్యుడిషియల్ అధికారిగా నాగార్జున

First Published | May 18, 2021, 11:22 AM IST

సిఐడి కస్టడీలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను కర్రలతో, ఫైబర్ తాళ్లతో తన పాదాలపై కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు.

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజుకు సికింద్రాబాదు ఆర్మీ ఆస్పత్రిలో ముగ్గురు వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఆయనకు దాదాపు 18 పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రఘురామకు ఆర్మీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
undefined
వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడిషియల్ అధికారిగా నియమించింది. నాగార్జున పర్యవేక్షణలో రఘురామ కృష్ణమ రాజుకు వైద్య పరీక్షలు జరగనున్నాయి. ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నంత వరకు నాగార్జున రఘురామ వెంటే ఉంటారు. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారిని నియమించాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.
undefined

Latest Videos


సిఐడి కస్టడీలో ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను కర్రలతో, ఫైబర్ తాళ్లతో తన పాదాలపై కొట్టారని రఘురామ కృష్ణమ రాజు కోర్టుకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిజీహెచ్ లోనూ రమేష్ ఆస్పత్రిలోనూ రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, గుంటూరు జీజీహెచ్ లో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. గుంటూరు వైద్య బృందం కోర్టుకు నివేదిక అందజేసింది.
undefined
రఘురామకృష్ణమ రాజుకు అయిన గాయాలు కొట్టడం వల్ల అయినవి కావని, ఎడెమా వల్ల అరిపాదాలు కమిలినట్లు అయ్యాయని వైద్యుల బృందం తేల్చింది. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించకపోవడంతో రఘురామ కృష్ణమ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రమేష్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి సిఐడి తరపు న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
undefined
రఘురామ కృష్ణమ రాజు తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు రఘురామకృష్ణమ రాజుకు సికింద్రాబాదులోని ఆర్సీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయనను సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
undefined
click me!