షాకింగ్ సర్వే రిపోర్టు: హుస్సేన్‌సాగర్, మరో చెరువుల్లో కరోనా వైరస్ గుర్తింపు

First Published May 14, 2021, 12:20 PM IST

హైద్రాబాద్ నగరంలోని కన్ని  చెరువుల్లో కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సైంటిస్టుల బృందం ఈ మేరకు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెలుతుచూసింది.

హైద్రాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తో పాటు మరో రెండు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్టుగా ఓ అధ్యయనం తెలిపింది.
undefined
హుస్సేన్ సాగర్ తో పాటు పెద్దచెరువు లేదా నాచారం సరస్సు, కూకట్‌పల్లిలోని తుర్క చెరువు లేదా నిజాం తలాబ్ లలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు.
undefined
హైద్రాబాద్ శివారులోని చెరువుల్లో మాత్రం కరోనా వైరస్ ఆనవాళ్లు గుర్తించలేదు. హైద్రాబాద్ కు సమీపంలోని ఎదులాబాద్, పోతురాజు చెరువుల్లో కరోనా వైరస్ ఆనవాళ్లు లభించలేదు.
undefined
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) సైంటిస్టులు, సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యూర్ బయోలజీ (సీసీఎంబీ) హైద్రాబాద్ , అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ ఇన్నేటివ్ రీసెర్చ్ (ఏసీఎస్ఐఆర్) ఘజియాబాద్ సంయుక్తంగా ఈ సరస్సుల్లో రీసెర్చ్ చేసింది.హైద్రాబాద్ నగరంలోని మురికి నీటిలో కరోనా వైరస్ ఆనవాళ్లను గతంలో నిర్వహించిన పరీక్షల్లో గురించిన విషయం తెలిసిందే.
undefined
హైద్రాబాద్ నగరంలోని చాలా చెరువులు మున్సిపల్ సీవరేజీ నెట్ ట్రీట్ మెంట్ లతో అనుసంధానం చేసి ఉన్నాయి. చాలా చెరువుల్లోకి మురికి నీరు నేరుగా వచ్చి చేరుతోంది.
undefined
కరోనా సెకండ్ వేవ్ ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో వెలుగు చూసింది. అయితే చెరువుల్లో కరోనా ప్రభావం ఈ ఏడాది ఏప్రిల్ మధ్య వారంలో కన్పించింది. ఈ నెల 12 వ తేదీన ఈ స్టడీ రిపోర్టును మెడీరిక్సివ్ ప్రచురించింది.
undefined
ఈ స్టడీ ప్రకారంగా మొదటి, రెండో వేవ్ ల కారణంగా అర్బన్ ప్రాంతాల్లోని చెరువులు, సరస్సుల్లో హై వైరల్ లోడ్ ఉన్న వైరస్ ను గుర్తించారు.
undefined
click me!