వివాహేతర సంబంధం : తనని కాదని మరొకరితో ఎఫైర్.. అనుమానంతో మహిళ హత్య..

First Published May 24, 2023, 1:54 PM IST

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా హతమార్చాడు. తనతో కాకుండా వేరేవారితో కూడా సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో హత్య చేశాడు. 

మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ జిల్లాలో కలకలం రేపిన మంజుల అనే మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈమె హత్య కేసులో నిందితుడిగా అనుమానించిన చెన్నయ్య.. తానే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడని జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప తెలిపారు. తనను కాదని ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందన్న కోపంతోనే హత్య చేసినట్లుగా చెన్నయ్య ఒప్పుకున్నాడు.  

కాగా,  మంజుల, చెన్నయ్యలది కూడా వివాహేతర సంబంధమే. ఈ నేపథ్యంలోనే ఆమెను అన్ని రకాలుగా తాను మంచిగా చూసుకుంటున్నప్పటికీ.. ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని కోపంతోనే అలా చేశానని చెన్నయ్య అంగీకరించాడు.

మంగళవారం రాజాపూర్ పోలీస్ స్టేషన్లో జడ్చర్ల రూరల్ సీఐ జమ్ములప్ప విలేకరుల సమావేశం నిర్వహించారు. జడ్చర్ల మండలంలోని పెద్దరేవల్లికి చెందిన మంజులకు మొదట మల్లేపల్లికి చెందిన రాచమల్ల యాదయ్యతో వివాహమయ్యింది. కొంతకాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 

దీంతో మంజుల తన కొడుకుతో సహా.. తన తల్లిగారి గ్రామమైన పెద్ద రేవల్లికి వచ్చేసింది. ఇక్కడే ఇల్లు కట్టుకుని కొడుకు శ్రీశైలంతో సహా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన యాట చెన్నయ్య అనే వ్యక్తితో కొద్ది కాలం క్రితం ఆమెకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. 

అయితే, మంజుల తనతో కాకుండా వేరే ఇతరులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుందని చెన్నయ్య అనుమానించాడు. దీంతో.. తీవ్ర కోపవేషానికి లోనైనా చెన్నయ్య ఆమెను చంపాలని నిర్ణయానికి వచ్చాడు. దీనికోసం ఓ పథకం వేశాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు.

ఈ క్రమంలోనే మే 19వ తేదీన ఉదయం 11 గంటలకు మంజుల చెన్నయ్య కు ఫోన్ చేసింది. తనకు బాలానగర్లో పని ఉందని తీసుకువెళ్లాలని కోరింది. తాను ఎదురు చూసిన సమయం రానే వచ్చింది అనుకున్న చెన్నయ్య మంజులను బైక్ మీద ఎక్కించుకుని బాలానగర్కు తీసుకువెళ్లాడు.  

అక్కడ మంజుల షాపింగ్ చేసిన తర్వాత.. తిరిగి బయలుదేరే క్రమంలో… ఊరి బయటకు వెళ్లి కల్లు తాగుదామని నమ్మించాడు.అలా ఆమెను.. ఊరు శివారులలో ఉన్న అగ్రహారం పొట్లపల్లి శివారులోని పెరుమాళ్ళ గుండు సమీపంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు మద్యం తాగారు. ఆ తర్వాత చెన్నయ్య ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. మంజుల తల మీద రాళ్లతో కొట్టి చంపేశాడు.  

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు చెన్నయ్య మీద అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని విచారించగా.. విషయాలు వెలుగు చూశాయి.  విచారణలో నిందితుడు నేరం అంగీకరించడంతో మంగళవారం అతడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లుగా జమ్ములప్ప తెలిపారు.

click me!