తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ కీలక నేతలు న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. మరో వైపున తెలంగాణలో ప్రతి 10 రోజులకు ఓసారి ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించేలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తుంది.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
తెలంగాణ సహా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నుండి పిలుపు వచ్చింది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై కాగ్రెస్ నాయకత్వంచర్చించనుంది.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో తెలంగాణపై ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. గత రెండు దఫాల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారానికి దూరమైంది. అయితే ఈ దఫా జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా ఉంది
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా కూడా రెండు దఫాలు అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నిరాశను మిగిల్చింది. దీంతో ఈ దఫా తెలంగాణలో పాగా వేసేందుకు ఆ పార్టీ కొంత కాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు నేతృత్వంలో ఎన్నికల వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సునీల్ కనుగోలు వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
ఈ నెల 8వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ను ప్రకటించింది. త్వరలోనే బీసీ డిక్లరేషన్ ను ప్రకటించనుంది.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
పీసీసీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం ఇవాళ హైద్రాబాద్ గాంధీ భవన్ లో ప్రారంభమైంది. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ నేతల మధ్య ఐక్యత తీసుకువచ్చింది నాయకత్వం. మరో వైపు ఓటర్లను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు కురిపించారు.
తెలంగాణలో ప్రియాంక విస్తృత పర్యటనకు ప్లాన్
priyanka gతెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో వరంగల్ సభలోనే ఆ పార్టీ ప్రకటించింది. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించారు. ఈ నెల 8న యూత్ డిక్లరేషన్ ను ప్రియాంక గాంధీ ప్రకటించారు. జూన్ లో ప్రియాంకగాంధీ సభను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. andhi