వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడంతో...

First Published | May 1, 2023, 9:21 AM IST

భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన భార్య అతడిని కాపుకాచి పట్టుకుంది. దీంతో కోపానికి వచ్చిన భర్త వారిమీద కత్తితో దాడి చేశాడు. 

హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంబంధాలు బయటపడడంతో సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకునే వారు కొందరైతే..  ఎదురు దాడి చేసి హత్యలు, దారుణాలకు పాల్పడుతున్న వారు మరి కొంతమంది. అలాంటి ఘటనే హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

హైదరాబాద్ : వివాహేతర సంబంధాలు కుటుంబ జీవితాలను నాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంబంధాలు బయటపడడంతో సమాజానికి భయపడి ఆత్మహత్యలు చేసుకునే వారు కొందరైతే..  ఎదురు దాడి చేసి హత్యలు, దారుణాలకు పాల్పడుతున్న వారు మరి కొంతమంది. అలాంటి ఘటనే హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 


]

హైదరాబాద్ జీడిమెట్లలోని గాజుల రామారావు వల్లభాయ్ నగర్ కు చెందిన విజయకుమార్ కు.. మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం పెద్దలు పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.

గత మూడేళ్లుగా విజయకుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్యను కూడా అప్పటినుంచి దూరంగా పెడుతూ వస్తున్నాడు.  అంతేకాదు విడాకులు ఇవ్వాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి తోడు ఇంటికి రావడం కూడా కొద్ది నెలలుగా మానేశాడు. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్లు చేసినా స్పందించడం లేదు.

దీంతో విసిగిపోయిన భార్య స్వప్న.. తన అక్కలు శ్యామల, మంజుల,  బాబాయ్ శ్రీనివాస్ లతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.  శనివారం రాత్రి  భర్త విజయ్ కుమార్.. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో ఉన్నాడన్న విషయం తెలుసుకొని వీరు అక్కడికి వెళ్లారు. విజయకుమార్ ని పట్టుకుని నిలదీశారు. 

దీంతో వీరి మధ్య గొడవ జరిగింది. కోపానికి వచ్చిన విజయ్ కుమార్.. భార్య స్వప్నను కొట్టడం ప్రారంభించాడు. అది చూసిన స్వప్న బాబాయ్ శ్రీనివాస్ అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతని మీద కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీనివాస్ మెడ, చేతులపై  తీవ్ర గాయాలయ్యాయి. 

వెంటనే అతనితో వచ్చిన మిగతా వాళ్ళు అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ దాడి నేపథ్యంలో ఆదివారం నాడు స్వప్న జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Latest Videos

click me!