Weather update: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంపై వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో రానున్న వాతావరణ మార్పులపై పూర్తి వివరాలు మీకోసం.
భారత వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. సౌత్ అండమాన్ సముద్రం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీని ప్రభావం కారణంగా త్వరలోనే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం పుట్టుకొచ్చే ఛాన్స్ ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో ఈ వాతావరణ మార్పుల పట్ల అధికారిక వర్గాలు అలర్ట్ అయ్యాయి.
25
వాయుగుండంగా మారే అవకాశం
ఇలా ఏర్పడే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న శనివారం నాటికి మరింత బలపడి సుస్పష్టమైన అల్పపీడనంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆదివారం నాటికి అదే ప్రాంతంలో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
35
మత్స్యకారులకు హెచ్చరికలు, సముద్రంలో అలజడి
ఈ వాతావరణ అస్థిరతల కారణంగా శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం చాలా అశాంతిగా, అలజడిగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మత్స్యకారులు ఎవరూ కూడా ఆగ్నేయ, నైరుతి అలాగే మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోకి వేట నిమిత్తం వెళ్లరాదని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఇది ఏ దిశగా కదులుతుందనే దానిపై పూర్తి స్పష్టత రానుంది. ప్రస్తుతానికి దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై నేరుగా లేదని తేల్చిచెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలి ప్రభావం, పొడి వాతావరణం
మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానంతో పాటు తెలంగాణ ప్రాంతంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ ఈశాన్య గాలల ప్రభావం వల్ల ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా పొడి వాతావరణం కొనసాగుతోంది. వర్ష సూచన లేకపోయినా వాతావరణంలో మాత్రం స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.
55
పెరిగిన చలి తీవ్రత.. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో చలి తీవ్రత ఒక్కసారిగా పడిపోతూ వస్తోంది. సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే దాదాపు 4 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి, ఉదయ వేళల్లో ప్రజలు తీవ్రమైన చలిని ఎదుర్కొంటున్నారు, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, వనపర్తి, ఆదిలాబాద్ లలో ఉష్ణోగ్రతలు చాలా తగ్గుముఖం పట్టాయి. చలి తీవ్రత పెరుగుతోంది.