ఓవైపు పిల్లలకు వేసవి సెలవలు దగ్గరపడుతున్నాయి. ఇక పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ల అల్లరి భరించలేం. అలా అని.. వాళ్లను ఎక్కడికైనా బయటకు తీసుకువెళదామా అంటే..మనకేమే ఆఫీసు వర్క్ లు. పిల్లల స్కూళ్లకు సెలవులు ఇచ్చినట్లు.. మనకు కూడా ఆఫీసుకు సెలవులు ఉంటే బాగుండు కదా అని చాలా మంది అనుకుంటారు. పిల్లలు లేని యూత్ కూడా అంతే.. ఎక్కడికైనా జాలీగా బయటకు వెళ్లివద్దామన్నా ఆఫీసు వర్క్ కారణంగా కుదరకపోవచ్చు. అన్ని ప్లేసులకు శనివారం, ఆదివారం రెండు రోజుల్లో వెళ్లి వచ్చేయలేం కదా. మీరు కూడా ఇదే విషయంలో బాధపడుతున్నారా? అయితే, ఈ గుడ్ న్యూస్ మీకోసమే. హ్యాపీగా ఈ ఏప్రిల్, మే నెలల్లో మీరు రెండు సార్లు ట్రిప్ కి వెళ్లి రావచ్చు. మరి, ఆ తేదీలేంటో చూద్దామా..