దుస్తులు లేకుండా తిరుగుతున్న సమయంలో దుస్తులను అందించిన వర్షిణితో అఘోరీ గత కొంత కాలంగా సావాసం చేసింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ వీరిద్దరు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. అయితే ఇదే సమయంలో వర్షిణిని వివాహం చేసుకొని కొత్త చర్చకు తెర తీసింది. మధ్యప్రదేశ్ లోని ఓ ఆలయంలో అఘోరీ, వర్షిణీ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఒకరికొకరు దండలు మార్చుకుని, తలంబ్రాలు పోసుకుని, ఏడడుగులు నడిచారు. స్థానిక భక్తులు ఉత్సహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక వర్షిణి విషయానికొస్తే ఈ యువతిది ఏపీలోని నందిగామ. బీటెక్ చదువకున్న వర్షిణికి అఘోరీ పరిచయమైంది. అఘోరీకి ఆకర్షితులైన వర్షిణి, తనతో ప్రేమలో కూడా పడింది. కొన్నాళ్లు వర్షిణీ ఇంటిలో ఉన్న అఘోరీ, వారి ఇంటిలో కొన్ని పూజలు చేసింది. అయితే అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తు వెంటా వర్షిణిని కూడా తీసుకెళ్లింది.