liquor price hike in telangana: మందు బాబుల‌కు షాక్.. మ‌ళ్లీ పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు?

Published : May 04, 2025, 09:03 PM IST

liquor price hike in telangana: మద్యం ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మద్యం సంస్థల సమాఖ్య (CIABC) తెలంగాణ ప్రభుత్వాన్ని సరఫరా ధరలను పెంచేందుకు అనుమతించమని కోరింది. దీంతో మ‌రోసారి మ‌ధ్య ప్రియుల‌కు ధ‌ర‌ల షాక్ తగిలే ఛాన్స్ ఉంది.   

PREV
15
liquor price hike in telangana: మందు బాబుల‌కు షాక్.. మ‌ళ్లీ పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు?

liquor price hike in telangana: తెలంగాణ‌లో మద్యం ప్రియుల‌కు షాక్ త‌గ‌ల‌నుంది. మ‌రోసారి మ‌ద్యం ధ‌ర‌లు పెరిగే అవ‌కాశముంది.  భారత మద్యం తయారీదారుల సమాఖ్య (CIABC) తెలంగాణ ప్రభుత్వాన్ని మద్యం సరఫరా ధరల పెంపుని ఆమోదించమని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి ప్రధానంగా మద్యం తయారీకి సంబంధించిన వ్యయాలు గణనీయంగా పెరగడం, అలాగే వార్షిక సమీక్షా విధానం లేకపోవడమే కారణమని తెలిపింది.

25

CIABC డైరెక్టర్ జనరల్ అనంత్ ఎస్. అయ్యర్ మాట్లాడుతూ.. ENA (Extra Neutral Alcohol), మాల్ట్ స్పిరిట్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, కార్మిక, రవాణా ఖర్చులు గత సంవత్సరం మే తర్వాత గణనీయంగా పెరిగాయని తెలిపారు.

ధరలపై వ్యవస్థీకృత సమీక్షా విధానం లేకపోవడంతో, ఈ పెరుగుదల మొత్తాన్ని తయారీదారులు మోయాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలికంగా పరిశ్రమకు లాభదాయకం కాదని అయ్యర్ తెలిపారు.

35

సీఐఏబీసీ ప్రస్తుత రెవెన్యూ-షేరింగ్ నిర్మాణంపై ఆందోళన వ్యక్తం చేసింది. CIABC ప్రకారం.. మద్యం గరిష్ట చిల్లర ధర (MRP)లో 70% కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. తయారీదారులకు కేవలం 12–15% మాత్రమే లభిస్తుంది. చిల్లర వ్యాపారులు 15–18% సంపాదిస్తారు.

"ఈ రెవెన్యూ షేర్ నమూనా ఖర్చుల పెరుగుదలను అధిగమించే తయారీదారుల సామర్థ్యాన్ని గణనీయంగా పరిమితం చేస్తుంది" అని అయ్యర్ అన్నారు. "ఎప్పటికప్పుడు పన్నులు పెంచడం ద్వారా ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతూనే ఉన్నాయి, అయితే సరఫరాదారుల మార్జిన్లు మాత్రం తగ్గుతున్నాయి" అని తెలిపారు. 

45

CIABC సూచించిన ముఖ్యమైన అంశం.. మద్యం పరిశ్రమ GST పరిధిలో లేదు  అందువల్ల తయారీదారులకు Input Tax Credit (ITC) లభించదు. GST చెల్లించిన ముడి పదార్థాలపై ITC లభించకపోవడం వల్ల, మద్యం తయారీ ఖర్చు 3–5% మేర పెరుగుతోందని అన్నారు. 

55

CIABC టోకు ధరల సూచీ (WPI)తో అనుసంధానమైన పెంపుదల నమూనాను కోరుతోంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL) ఒక్కో కేసుకు రూ.100 నుంచి రూ. 200, వైన్ ఉత్పత్తులపై 5% ధర పెంపును సరఫరా ధరలో కోరింది. దీనివల్ల వినియోగదారులపై 180 మిల్లీలీటర్ల బాటిల్‌పై ₹2.50 నుండి ₹5 వరకు భారం పడుతుంది. బీర్ విభాగానికి ఇప్పటికే ధరల పెంపునకు ఆమోదం లభించగా, స్పిరిట్, వైన్ తయారీదారులకు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఇంకా ఆమోదం లభించలేదని CIABC పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories