బిఆర్ఎస్ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు .. కేటీఆర్ ఎవరిని ఇంత మాటన్నారు?

Published : May 24, 2025, 12:20 PM ISTUpdated : May 24, 2025, 05:12 PM IST

బిఆర్ఎస్ పాార్టీలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న కవిత, నేడు కేటీఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్నారు. దీంతో అసలు బిఆర్ఎస్ లో ఏం జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది. 

PREV
15
కేసీఆర్ కుటుంబ కలహాలు నిజమేనా?

KTR : తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రికి ప్రస్తుత రాజకీయ వ్యవహారాలు, బిఆర్ఎస్ వ్యవహార తీరుపై ఓ లేఖ రాసారు. అయితే ఈ లేఖ కాస్త బైటకు రావడంతో దుమారం రేగింది. ఈ లేఖ వ్యవహారం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందా? లేక కుటుంబంలో చిచ్చు మొదలయ్యాకే లేఖ బైటకు వచ్చిందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

25
కవిత మాటల్లో కేసీఆర్ చుట్టున్న దెయ్యాలెవరు?

అయితే తండ్రికి తాను రాసిన లేఖ బయటకు రావడం కుట్రలో భాగమేనని కవిత అంటున్నారు. తన తండ్రి దేవుడు... ఆయన చుట్టు దెయ్యాలున్నారంటూ కవిత అన్నారు. కవిత ఎవరికి ఉద్దేశించి ఈ కామెంట్స్ చేసారు? సోదరులు కేటీఆర్, సంతోష్ ల గురించా లేక బావ హరీష్ రావు గురించా అన్న చర్చ జరుగుతోంది. ఇలా కల్వకుంట్ల కుటుంబంతో వివాదం రాజుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేసారు.

35
కవిత లెటర్ పై కేటీఆర్ రియాక్షన్

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడంతో కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో దీనిపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తన సోదరి కవిత లేఖ వ్యవహారంపైనా స్పందించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామిక స్ఫూర్తితో నడుస్తుందని... అందుకే ఎవరైనా పార్టీ అధ్యక్షుడికి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని అన్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలామంది నేరుగా తమ అభిప్రాయాలను తెలియజేసారు... కొందరు అధినేతకు ఉత్తరాలు కూడా రాసారని తెలిపారు. ఇలా పార్టీలో ప్రతి ఒక్కరికి స్వే,చ్చ ఉంటుందన్నారు కేటీఆర్.

45
బిఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు : కేటీఆర్

అయితే పార్టీలో చర్చించాల్సిన విషయాలను బైట మాట్లాడకూడదని కేటీఆర్ సూచించారు. బిఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరు తక్కువకాదు.. అందరూ కార్యకర్తలేనని కేటీఆర్ అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. అయితే మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులు ఉండొచ్చంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

55
అసలు దెయ్యం రేవంత్ రెడ్డే : కేటీఆర్

కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న కవిత వ్యాఖ్యలపైనా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తమ పార్టీలో దెయ్యాలెవరూ లేరు... తెలంగాణకు పట్టిన పెద్ద దెయ్యం రేవంత్‌రెడ్డే అని అన్నారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్ పార్టీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేసారు.

Read more Photos on
click me!

Recommended Stories