మంగ‌ళ‌సూత్రం తీయ‌మ‌న్న‌ప్పుడు ఏడ్చేశా, ఆ ఫుడ్ చూసి వాంతి వ‌చ్చింది. ఎమోష‌న‌ల్ అయిన క‌విత‌

Published : Mar 07, 2026, 02:25 PM IST

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై వ‌చ్చిన లిక్క‌ర్ కేసు ఆరోప‌ణ‌ల నుంచి క్లీన్‌గా బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె యూట్యూబ‌ర్‌ తుల‌సి చందు పాడ్‌కాస్ట్‌ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. 

PREV
14
కవితకు క్లీన్ చీట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మల్సీ కవిత కూడా ఉన్నారు. అయితే కేసు విచారణలో భాగంగా కొన్ని రోజులు కవిత జైలు జీవితాన్ని అనుభవించారు. ఈ సమయంలో తాను ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందికర పరిస్థితుల గురించి ఆమె ఇలా చెప్పుకొచ్చారు.

24
అప్పుడు ఏడ్చాను

ఈడీ విచారణలో ఆభరణాల గురించి ఎలాంటి నిబంధన పెట్టలేదని కానీ జైలుకు వెళ్లిన సమయంలో నిబంధనల ప్రకారం తన తాలిబొట్టును తీయమని చెప్పడం తనకు అత్యంత బాధాకరమైన విషయమని కవిత పేర్కొన్నారు. నిజానికి ప్రస్తుత మోడ్రన్ సొసైటీలో రాత్రుళ్లు పడుకునే సమయంలో మంగళసూత్రాలను తీసి పక్కన పెడుతున్నారని కానీ ఎవరో వ్యక్తి తీయమని అడగడం చాలా బాధ కలిగించిందన్నారు. ఒక హిందూ మహిళగా మంగళసూత్రానికి ఇచ్చే గౌరవం, ఆ సమయంలో కలిగిన మానసిక వేదన గురించి ఆమె వివరించారు.

34
తీహార్ జైలులో ఎదురైన పరిస్థితులు

ఇక తీహార్ జైలులో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితుల గురించి కూడా కవిత ప్రస్తావించారు. భోజనం సమయంలో తనకు ఇచ్చి ప్లేట్లు, ఆహారం చూస్తేనే వాంతి వచ్చేలా ఉండేవని వాపోయారు. గ‌దిలో తనతో పాటు ఉన్న ఇద్దరు మహిళలు మర్డర్ కేసులో ఉన్నవారని చెప్ప‌గానే, మొదట కొంత ఆందోళన కలిగినా తర్వాత వారు కూడా సాధారణ మనుషులే అని అర్థమైందని క‌విత చెప్పకొచ్చారు.

44
కేసీఆర్ మాటే నిజ‌మైంది

కేసు నుంచి గౌరవప్రదంగా డిస్చార్జ్ (Honorable Discharge) అయినప్పుడు తనకు కలిగిన అనుభూతి గురించి క‌విత‌త వివ‌రించారు. తన తండ్రి కేసీఆర్ ప్పుడూ చెప్పే "కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది" అనే మాట నిజమైందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, అందుకే ఎంత ఇబ్బంది పెట్టినా ధైర్యంగా నిలబడ్డానని ఆమె స్పష్టం చేశారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories