Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?

Published : May 29, 2026, 08:04 AM IST

Hyderabad Real Estate : హైదరాబాద్ లోని రాయదుర్గంలో టీజీఐఐసీ భూముల వేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఎకరం ఏకంగా రూ. 237 కోట్లు పలికి రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను షేక్ చేసింది. అసలు భూములు ధరలు ఎందుకు ఇంతలా పెరుగతున్నాయి?

PREV
14
రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ బ్లాక్‌బస్టర్.. ఊహలకందని రేటు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన సత్తా చాటింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలకు గట్టి పోటీ ఇస్తూ, నగరం భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. తాజాగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదైంది. 

ఐటీ కారిడార్‌గా గుర్తింపు పొందిన రాయదుర్గం (పాన్‌మక్తా) ప్రాంతంలో కేవలం ఒక్క ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్ల ధర పలికి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దక్షిణ భారతదేశంలోనే ఇంత భారీ ధర పలకడం ఇదే తొలిసారి కావడం విశేషం.

24
పోటాపోటీగా బిడ్లు.. గౌర వెంచర్స్ కైవసం

రాయదుర్గం గ్రోత్ కారిడార్‌లోని సర్వే నంబర్ 83/1లో గల 6 ఎకరాల 29 గుంటల భూమికి కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌టీసీ (MSTC) పోర్టల్ ద్వారా డిజిటల్ వేలం నిర్వహించారు. అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘జేఎల్‌ఎల్’ ఈ ప్రక్రియలో ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించింది. ఈ ల్యాండ్ పార్సిల్‌ను దక్కించుకోవడానికి దేశంలోని టాప్ డెవలపర్లు, కార్పొరేట్ దిగ్గజాలు పోటాపోటీగా బిడ్లు వేశారు.

చివరకు తీవ్రమైన పోటీ మధ్య హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని రూ. 1,490.73 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ స్థలంలో అత్యాధునిక బహుళ అంతస్తుల వాణిజ్య, ఐటీ కాంప్లెక్స్‌లను నిర్మించనున్నట్లు గౌర వెంచర్స్ అధినేత ఆదిత్య గౌర ప్రకటించారు.

34
70 శాతం అదనపు ధర.. ఎందుకింత డిమాండ్?

ఈ భూమికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ప్రాథమిక ధర ఎకరాకు రూ. 139 కోట్లు. కానీ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ వల్ల ఏకంగా 70.5 శాతం అదనపు ధర లభించింది. గత ఏడాది అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఎకరం ధర రూ. 177 కోట్లు పలకగా, కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే ఆ రికార్డు బద్దలై 34 శాతం అదనపు విలువ పెరగడం గమనార్హం.

ఈ ప్లాట్‌కు ఉత్తరాన 150 అడుగుల రోడ్డు, పడమర 100 అడుగుల రోడ్డు ఉండటం, టీ-హబ్ వెనుక భాగంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉండటంతో డెవలపర్లు క్యూ కట్టారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ కంపెనీలు, మెట్రో కనెక్టివిటీ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వంటి మౌలిక వసతులు రాయదుర్గాన్ని ఒక హాట్ స్పాట్‌గా మార్చేశాయి.

44
ఫ్యూచర్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కాసుల వర్షం

రాయదుర్గంతో పాటు ఫ్యూచర్ సిటీ (రావిర్యాల) ప్రాంతంలో జరిగిన హౌసింగ్ బోర్డు భూముల వేలానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ చదరపు గజం గరిష్ఠంగా రూ. 83,500 ధర పలికింది. కేవలం నాలుగు ప్లాట్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 140 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈ వేలం ప్రక్రియపై టీజీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ కే శశాంక స్పందిస్తూ, "ఈ స్పందన హైదరాబాద్, తెలంగాణా ఆర్థిక వ్యవస్థపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో కల్పిస్తున్న అనుకూల వాతావరణమే ఇందుకు కారణం" అని పేర్కొన్నారు. కాగా, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్, చింతల్ పరిధిలోని మరికొన్ని ప్లాట్లకు కూడా వేలం ప్రక్రియ కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories