ఆసక్తికర విషయం ఏమిటంటే మాగంటి కుటుంబంవద్ద కిలోల కొద్ది బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో చూపించారు. గోపినాథ్ వద్ద 1,760 గ్రాముల బంగారం (రూ.1,01,13,500 విలువ), 5 కిలోల వెండి (రూ.3,67,500) ఉన్నట్లు ప్రకటించారు. ఇక సునీత వద్ద 3,650 గ్రాముల బంగారం (రూ.2,06,22,500 విలువ), ఐదు కిలోల వెండి (రూ.3,67,500 విలువ) ఉన్నట్లు వెల్లడించారు.
మాగంటి దంపతులకు ముగ్గురు పిల్లలు... వారివద్ద కూడా బాగానే బంగారం ఉన్నట్లు చూపించారు. అక్షరనాగ వద్ద రూ.25,99,000 విలువచేసే 460 గ్రాముల బంగారం, వాత్సల్యనాథ్ వద్ద రూ.15,53,750 విలువచేసే 275 గ్రాముల బంగారం, దిశిర వద్ద రూ.36,16,000 విలువచేసే 640 గ్రాముల బంగారం ఉన్నట్లు మాగంటి గోపినాథ్ ఎన్నికల అపిడవిట్ లో పేర్కొన్నారు. ఇలా మాగంటి కుటుంబంవద్ద కిలోలకొద్ది బంగారం ఉంది.