Hyderabad: ట్రాఫిక్ త‌గ్గ‌డం, రియ‌ల్ ఎస్టేట్ పెర‌గ‌డం ఖాయం.. హైద‌రాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్‌కు టెండ‌ర్లు

Published : Oct 15, 2025, 06:50 AM IST

Hyderabad: ఆ ప్రాంత ప్ర‌జ‌ల ఎన్నో ఏళ్ల క‌ల సాకారం కానుంది. ఇన్ని రోజులు ట్రాఫిక్‌తో ఇబ్బంది ప‌డ్డ ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం ల‌భించ‌నుంది. హైద‌రాబాద్‌లో మ‌రో కీల‌క ప్రాజెక్టుకు సంబంధించిన టెండ‌ర్ల ప్ర‌క్రియ ఈ నెల 29న ప్రారంభమ‌వుతోంది. 

PREV
15
కీల‌క ప్రాజెక్టు

హైదరాబాద్‌లో మరో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుకు శ్రీకారం ప‌డుతోంది. సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌ నుంచి శామీర్‌పేట్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్) ఇంటర్‌ఛేంజ్‌ వరకు 18.10 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. హెచ్‌ఎండీఏ (హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఈ నెల 29న టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమైంది.

25
భారీ వ్యయం

ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 3,619 కోట్లు. ఇందులో భూ సేకరణ, పరిహారం, రక్షణ శాఖ భూముల బదిలీ వంటి అంశాలు కూడా ఉన్నాయి. రక్షణ శాఖకు చెందిన 113.48 ఎకరాల భూమి అప్పగింతకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం వల్ల ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగనుంది. ఈ కారిడార్‌ పూర్తవగానే సికింద్రాబాద్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు ప్రయాణం పూర్తిగా సిగ్నల్‌-రహితంగా మారుతుంది.

35
ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఈ ఎలివేటెడ్ కారిడార్ రెండు దిశ‌ల్లో జ‌ర‌గ‌నుంది. వీటిలో ఒక‌టి ప్యార‌డైజ్ నుంచి డైయిరీఫాం వ‌ర‌కు. దీని ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. ఇది పూర్త‌యితే మేడ్చ‌ల్‌, నిజామాబాద్‌, మెద‌క్ వైపు వెళ్లే వారికి ఊర‌ట ల‌భించ‌నుంది. ఇక రెండో మార్గ‌మ‌మైన శామీర్‌పేట్‌ కారిడార్‌కు కూడా టెండర్లు పిలుస్తున్నారు. దీంతో తిరుమ‌ల‌గిరి, అల్వాల్‌, లోతుకుంట లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా త‌గ్గుతుంది. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తర తెలంగాణ వైపు రాకపోకలు సులభమవుతాయి. జేబీఎస్ నుంచి అవుట‌ర్ రింగ్ రోడ్డుకు కేవ‌లం 30 నిమిషాల్లో చేరుకోవ‌చ్చు.

45
రియ‌ల్ ఎస్టేట్‌కి కూడా ఊతం

హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గించడంతో పాటు నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుంది. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వరకు ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ పూర్తయితే, సమయాన్ని ఆదా చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాణిజ్య అవకాశాలు కూడా పెరగనున్నాయి. అంతేకాకుండా రియ‌ల్ ఎస్టేట్ రంగం కూడా భారీగా పెర‌గ‌నుంది. ఉద్యోగులు న‌గ‌ర శివార్ల‌లో నివాసం ఉండేందుకు ఆస‌క్తి చూపిస్తారు. అవుట‌ర్ నుంచి ప్యార‌డైజ్‌కు అక్క‌డి నుంచి మెట్రోలో న‌గ‌రంలో ఎక్క‌డికైనా వెళ్లే వెసులుబాటు ల‌భిస్తుంది.

55
ప్రాజెక్టు ముఖ్య వివరాలు

* ప్రాజెక్టు ప్రారంభ స్థలం సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ జంక్షన్‌, ముగింపు స్థలం శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజ్‌.

* మొత్తం పొడవు - 18.10 కిలోమీటర్లుగా ఉంది.

* అవసరమైన భూమి - 197 ఎకరాలు

* రక్షణ శాఖ భూమి - 113.48 ఎకరాలు

* అంచనా వ్యయం - రూ. 3,619 కోట్లు

Read more Photos on
click me!

Recommended Stories