పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

First Published | Nov 8, 2023, 1:17 PM IST

టిక్కెట్ల కేటాయింపు అంశం కాంగ్రెస్ లో  కాక రేపుతుంది. ఇద్దరు సీనియర్ నేతలు తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి తమ వారికే టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.
 
పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

పటాన్ చెరు అసెంబ్లీ స్థానం విషయమై కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి  మధ్య  మాటల తూటాలకు కారణమైంది.పటాన్ చెరు స్థానంలో అభ్యర్థిని మార్చాలని దామోదర రాజనర్సింహ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అభ్యర్ధిని మార్చవద్దని జగ్గారెడ్డి కూడ  పార్టీ నాయకత్వంతో మాట్లాడుతున్నారు.

పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

ఉమ్మడి మెదక్ జిల్లాలోని  పటాన్ చెరు,  నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాల్లో  తాను సూచించిన వారికి టిక్కెట్లు కేటాయించకుండా  వేరేవారికి టిక్కెట్లు కేటాయించడంపై  దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయాన్ని తీసుకుంటానని ఆయన  ప్రకటించారు.
 
Latest Videos

పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

ఈ విషయం తెలిసిన  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. అయితే  టిక్కెట్ల కేటాయింపు విషయంలో  తాను  సూచించిన వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించిన తర్వాత మాట్లాడాలని కోరారు. 

పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

పటాన్ చెరు అసెంబ్లీ స్థానంలో కాటా శ్రీనివాస్ కు, నారాయణఖేడ్ లో సంజీవరెడ్డికి టిక్కెట్టు కేటాయించాలని  దామోదర రాజనర్సింహ పట్టుబట్టారు. పటాన్ చెరులో  నీలం మధుకు , నారాయణఖేడ్ లో  సురేష్ కు టిక్కెట్టు కేటాయించింది కాంగ్రెస్ నాయకత్వం.  దీంతో  దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. 
 
పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

పటాన్ చెరు అసెంబ్లీ స్థానంలో నీలం మధును మార్చవద్దని  జగ్గారెడ్డి ఎఐసీసీ నేతలకు  ఫోన్ చేశారు. ఒకవేళ  నీలం మధును మార్చితే తన నిర్ణయం తాను తీసుకుంటానని కూడ జగ్గారెడ్డి పార్టీ నేతలకు  తేల్చి చెప్పారు. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్లు  టిక్కెట్ల కేటాయింపు విషయంలో  తమ వర్గం వారికే కేటాయించాలని  పట్టుబడుతుండడం కలకలం రేపుతుంది.

పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

పటాన్ చెరు అసెంబ్లీ స్థానం నుండి టిక్కెట్టు దక్కించుకున్న  నీలం మధు ఇవాళ  గాంధీభవన్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బీ ఫాం తనకు కేటాయిస్తారని  మధు ధీమాగా ఉన్నారు. ఈ నెల  10వ తేదీన  నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా ఆయన ప్రకటించారు. కాటా శ్రీనివాస్ తో కలిసి  పనిచేస్తున్నానని కూడ ఆయన  పార్టీ నేతలకు హామీ ఇచ్చారు.  

click me!